AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: దిల్ రాజు.. ‘దిల్’ ఎందుకు దిగాలు పడింది ?

ఇండస్ట్రీలో ఆయనో పెద్ద దిక్కు..తల్లో నాలుకలా, ఆ నలుగురిలో ఒకడిలా ఇన్నాళ్లూ ఆయన్ను హైలో చూసింది ఇండస్ట్రీ. కానీ ఎందుకో కొన్నాళ్లుగా ఆయన దిల్ దిగాలు పడింది..మనసు మనసులో లేదు. వాలెట్‌ ఫుల్ వాల్యూమ్ ఉన్నా వాల్యూ పడిపోయిందని తెగ ఇదైపోతున్నారు..నిజంగా ఇండస్ట్రీలో ఆయనకు గౌరవం తగ్గిందా..లేక నిర్మాతకే వాల్యు తగ్గిందా..ఆయన బాధ..తన గురించా..ఇండస్ట్రీ గురించా..?

Dil Raju: దిల్ రాజు.. 'దిల్' ఎందుకు దిగాలు పడింది ?
Dil Raju
Ram Naramaneni
|

Updated on: Feb 18, 2026 | 9:58 PM

Share

సినీ ఇండస్ట్రీకి నిర్మాతే ఆయువుపట్టు. ఆక్సీజన్. ప్రాణాధారం. అలాంటి ప్రొడ్యూసర్‌కు హోటల్ ప్రొప్రెయిటర్‌కున్నంత వాల్యూ కూడా ఇవ్వడంలేదా..అంటే బల్లగుద్దీ మరీ అవునంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. దిల్‌రాజు..నిన్నా మొన్న వచ్చిన ప్రొడ్యూసరేం కాదు. చాలా కింది నుంచి వచ్చి సక్సెస్‌ఫుల్ అయిన ప్రొడ్యూసర్‌. అలాంటి ప్రొడ్యూసర్‌ కూడా ఇండస్ట్రీలో తమకు విలువ లేదనడం ఇప్పుడు బిగ్ డిబేటబుల్ పాయింట్

ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గ్ లో నిర్మించిన రిసార్ట్, స్పాలను ప్రారంభించేందుకు తెలుగు తమిళ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఈసందర్భంలోనే దిల్ రాజు ఈ చేదు నిజాన్ని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు, లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళను దేవుళ్ళుగా భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓ సందర్భాల్లో కింద కూర్చుంటే, కొందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ ముందే కుర్చీల్లో కూర్చునేవారు. అంత గౌరవం నాటి రోజుల్లో ఉండేది..కానీ ఇప్పుడు అలా లేదన్నది దిల్‌రాజు ఆవేదన. ఆక్రందన.మనోవేదన. స్టార్లు, డైరెక్టర్లకు భయపడే రోజులు వచ్చాయని, వందల కోట్లు పెడుతున్నా పుచ్చుకునేవారిదే పైచేయి అంటున్నారు దిల్‌రాజు.

ఇచ్చేవాడి చేయి పైనుండటం..తీసుకునేవాడి చేయి కిందుండటం సహజం. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇచ్చేవారి చేయికంటే..పచ్చుకునేవారి చేయే పైచేయి అంటున్నారు దిల్‌రాజు. ఒకప్పుడు నిర్మాతలు అందరినీ శాసించే వారని, కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్లే ఇచ్చిన వాళ్ళను శాసించే స్టేజికి వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. సింపుల్ గా చెప్పినా ఆయన మాటల్లో నిగూడార్థం ఉందంటున్నారు సినీ పండితులు.

ఇంతకూ దిల్‌రాజు మాటలను ఎవర్ని ఉద్దేశించి. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య రేస్ నడుస్తోంది. ఈనేపధ్యంలో దిల్‌రాజు దిల్ దిగాలు పడిందా..అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది.మొత్తానికి వినడానికి కాస్త చేదుగా ఉన్నా..దిల్‌రాజు ఉన్నమాటే అన్నాడంటున్నారు సినీ పరిశీలకులు.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.