AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్‌కు చిన్నప్పుడే ఆ అలవాటు ఉందా? ఆసక్తికర విషయం చెప్పిన సురేఖ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇదిలా ఉంటే రామ్ చరణ్ గురించి అతని తల్లి సురేఖ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Ram Charan: రామ్ చరణ్‌కు చిన్నప్పుడే ఆ అలవాటు ఉందా? ఆసక్తికర విషయం చెప్పిన సురేఖ
Ram Charan
Basha Shek
|

Updated on: Feb 18, 2026 | 9:51 PM

Share

ఇవాళ (ఫిబ్రవరి 18) మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు. దీంతో చిరంజీవి, రామ్ చరణ్ ఇతర కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు సురేఖమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి తన భార్య పట్ల ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. 1980 ఫిబ్రవరి 20న మనం వివాహం చేసుకున్న నాటినుంచి సురేఖనే తన బలంగా మారిందని, కుటుంబానికి కేంద్ర బిందువుగా మారిందని సతీమణిపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్. ‘నా విజయానికి రహస్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే… అది నా ప్రతిభ, కృషి కాదు — “అది నువ్వే’ అంటూ సురేఖపై తన ప్రేమకు అక్షర రూపమిచ్చారు చిరంజీవి. ఈ సందర్భంగా సురేఖతో వివిధ సందర్భాల్లో దిగిన పలు త్రో బ్యాక్ ఫొటోలను కూడా షేర్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా నెట్టింట బాగ వైరలవుతున్నాయి. ఇక రామ్ చరణ్ కూడా తల్లికి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఆహా అన్ స్టాపబుల్ షోకు రామ్ చరణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సురేఖ తన కుమారుడి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

ఇవి కూడా చదవండి

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని ఆమె తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. అయితే టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. ఇక రామ్ చరణ్‌కు కిల్లీ అంటే చాలా ఇష్టమని సురేఖ తెలిపింది. చిన్నపిల్లలు కిల్లీలు వేసుకోవద్దని చెప్పినా కూడా వినకపోయేవాడు. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

రామ్ చరణ్ గురించి సురేఖ మాటల్లో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ తో దెబ్బతిన్న రామ్ చరణ్ ఇప్పుడు పెద్దిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us