AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sayaji Shinde: ఆ హీరో చెప్పిన ఒక్క మాట.. నా జీవితాన్ని మార్చేసింది.. నటుడు సయాజీ షిండే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలతో ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. కొన్నాళ్లుగా సినీరంగంలో విలన్ పాత్రలు, సహయ నటుడిగా కనిపిస్తూ తనదైన ముద్ర వేసిన నటులలో సయాజీ షిండే ఒకరు. అయితే మరాఠీ నుంచి వచ్చిన తనకు తెలుగు సినీరంగంలో హీరోలు ఎంతో సాయం చేశారని అన్నారు.

Sayaji Shinde: ఆ హీరో చెప్పిన ఒక్క మాట.. నా జీవితాన్ని మార్చేసింది.. నటుడు సయాజీ షిండే..
Sayaji Shinde
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2025 | 1:45 PM

Share

తెలుగు ప్రేక్షకులకు నటుడు సయాజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలతో అలరించారు. నటుడిగా, విలన్ గా కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సయాజీ షిండే తన తెలుగు సినీ ప్రయాణం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాతో మొదలైందని అన్నారు. ఒక థియేటర్ నటుడిగా, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటేనే న్యాయం జరుగుతుందని చిరంజీవి తనను కెరీర్ మొదట్లో ఎంతో ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి 25 ఏళ్లుగా తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెబుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తనకి రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడి అభిమానులు తనను ఎంతగానో ఆదరిస్తారని చెప్పారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

అమెరికా, జర్మనీ, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో ఉన్న తెలుగు అభిమానులు తనను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారని, భోజనం పెట్టి, తమ పనులను మానుకొని మరీ సమయం కేటాయించేవారని, అది నిజమైన ప్రేమ అని ఎమోషనల్ అయ్యారు. తనకు ఇష్టమైన డైలాగ్‌లలో “తిన్నామా.. పడుకున్నామా.. తెల్లరిందా.” ఒకటి కాగా, రైతుల గురించి చెప్పిన “ఒక దేశం వెనకబడిందంటే దానికి కారణం రైతు, ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి కారణం రైతే” అనే డైలాగ్ కూడా తనకు చాలా ఇష్టమని తెలిపారు. తన ఫేవరేట్ చిత్రాలు ఠాగూర్, పోకిరి, అరుంధతి, శూల్ వంటి ఇష్టమైన అన్నారు.

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

మరాఠీ నుండి తెలుగుకు తన ప్రయాణంలో చిరంజీవి గారి ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. నాగార్జున తో కలిసి అనేక సినిమాలు చేశానని, ఒక సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున తన భుజంపై చేయి వేసి “భయం వేసిందా” అని అడిగిన తీరు తనని ఆకట్టుకుందని చెప్పారు. మహేష్ బాబు చాలా క్రమశిక్షణతో, కూల్‌గా, సరదాగా ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ విల్ పవర్ ఉన్న ఆస్కార్ నటుడని ప్రశంసించారు. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ , నిజాయితీ గల మనిషి అని, రామ్ చరణ్ చాలా వినయంగా ఉంటారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు టవల్ తెచ్చి ఇచ్చేవారని, తెలుగు నటులు చాలా మంచివారని షిండే కొనియాడారు.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

Sayaji Shinde, Chiranjeevi

Sayaji Shinde, Chiranjeevi

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.