OTT Movie: ఓటీటీలో ‘రాజు వెడ్స్ రాంబాయికి’ సూపర్బ్ రెస్పాన్స్.. వారికి బంపరాఫర్.. పూర్తి వివరాలివే
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చింది ఓటీటీ సంస్థ.

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి సినిమా . కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ రియల్ లవ్ స్టోరీలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో భయపెట్టారు. శివాజీ రాజా, అనితా చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.17 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. డిసెంబరు 18వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 15 నిమిషాలు కాగా, ఓటీటీలో మాత్రం మరిన్ని అదనపు సన్నివేశాలతో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇప్పటివరకూ 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఈటీవీ విన్ సంస్థ అధికారికంగా తెలిపింది. .
ఈ సందర్భంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీని మళ్లీ మళ్లీ చూస్తున్న ప్రేక్షకులకు ఈటీవీ విన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సందర్భంగా తమ సబ్ స్క్రైబర్ల కోసం ఓ బంపరాఫర్‌ను కూడా తీసుకొచ్చింది ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ . నెలవారీ ప్రీమియం తీసుకునే వారు ‘RWR50’ కోడ్ ఉపయోగించి రూ. 50 రాయితీ పొందవచ్చు. అలాగే, ‘RWR100’ కోడ్ ఉపయోగించి, వార్షిక చందాదారులు రూ.100 రాయితీ పొందవచ్చు.
ఈటీవీ విన్ లో రాజు వెడ్స్ రాంబాయి..
Raju Weds Rambai crosses 100 MILLION streaming minutes on @etvwin. 🎉 Thank you for all the love, support, and repeat watches. Streaming now on @etvwin. 📺
🎟️ Special Offers: Use code ‘RWR50’ – ₹50 OFF on Monthly Premium Pack Use code ‘RWR100’ – ₹100 OFF on Yearly Premium… pic.twitter.com/Fb8pO58rXV
— ETV Win (@etvwin) December 27, 2025
ఈటీవీ విన్ లోని మరిన్ని సినిమాలు..
Paanch Pataka 🧨 Entertainment ka dhamaka! Watch all our latest blockbusters For just ₹49 monthly (Use WIN50) ₹599 yearly (Use WIN100) Offer ends Soonnn!!!#EtvWin pic.twitter.com/5PNkAvZ2GO
— ETV Win (@etvwin) December 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




