Salman Khan : వయసు 60 ఏళ్లు.. ఇప్పటికీ తగ్గని డిమాండ్.. సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎంతంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్లతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సల్మాన్ పర్సనల్ విషయాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. హిందీతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 27న సల్మాన్ 60వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు విషెస్ తెలిపారు. అలాగే ముంబైలోని తన నివాసం వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. మార్చిలో అమీర్ ఖాన్, నవంబర్‌లో షారుఖ్ ఖాన్ తర్వాత 2025లో 60 ఏళ్లు నిండిన ఖాన్‌ల జాబితాలో సల్మాన్ చేరారు. ఈ హీరో తన పుట్టిన రోజు వేడుకలను పన్వెల్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో క్రికెటర్ ఎంఎస్ ధోని, సెలబ్రెటీస్ సైతం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
నివేదికల ప్రకారం సల్మాన్ ఆస్తులు రూ.29000 కోట్లు. సినిమాలతోపాటు టెలివిజన్, ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార సంస్థల నుంచి భారీగానే సంపాదిస్తున్నారు. అలాగే అతడు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 100 నుండి రూ. 150 కోట్లు వసూలు చేస్తారట. కొన్ని సందర్భాల్లో రెమ్యునరేషన్ తోపాటు లాభాలు తీసుకుంటారు. అతడు ఎండార్స్‌మెంట్‌ల ద్వారా రూ. 60 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
అలాగే తన సొంత నిర్మాణ సంస్థలు సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, SKF ఫిల్మ్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. దీని విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా. 5 BHK గోరై బీచ్ హౌస్ , వర్లి, కార్టర్ రోడ్ వంటి ప్రాంతాలలో ఇళ్ళు, దుబాయ్‌లోని బుర్జ్ పసిఫిక్ టవర్స్, ది అడ్రస్ డౌన్‌టౌన్ వంటి ప్రదేశాలలో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
