Year Ender 2025 : ఒకరికి 300 కోట్లు..మరొకరికి 180 కోట్లు..ఈ క్రికెటర్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
Year Ender 2025 : 2025వ సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఈ ఏడాది క్రికెట్ మైదానంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. కేవలం ఆటలోనే కాదు, ఆదాయంలోనూ మన క్రికెటర్లు సరికొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, విరాట్ కోహ్లీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Year Ender 2025 : 2025వ సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఈ ఏడాది క్రికెట్ మైదానంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. కేవలం ఆటలోనే కాదు, ఆదాయంలోనూ మన క్రికెటర్లు సరికొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, విరాట్ కోహ్లీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అడ్వర్టైజ్‌మెంట్లు, ఐపీఎల్ కాంట్రాక్టులతో అతను ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే క్రికెటర్‌గా నిలిచాడు.
1. విరాట్ కోహ్లీ : టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా, కింగ్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్నంటుతోంది. 2025లో కోహ్లీ మొత్తం ఆదాయం రూ.250 – 300 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రూ.21 కోట్లు, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు పొందుతున్న కోహ్లీ.. మిగిలిన భారీ ఆదాయాన్ని ప్యూమా, ఆడి, ఎంఆర్‌ఎఫ్ వంటి దాదాపు 30 పైగా బ్రాండ్ల ప్రమోషన్ల ద్వారా ఆర్జిస్తున్నాడు.
2. రోహిత్ శర్మ : భారత టెస్ట్, వన్డే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆదాయంలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది అతను రూ.150 – 180 కోట్ల మధ్య సంపాదించాడు. ముంబై ఇండియన్స్, బీసీసీఐ ఒప్పందాల ద్వారా రూ.23.30 కోట్లు రాగా, అడిడాస్, సీయెట్ వంటి బ్రాండ్ల ప్రకటనలు అతడికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
3. రిషబ్ పంత్ : ప్రమాదం నుంచి కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టిన పంత్.. ఈ ఏడాది తన పాపులారిటీని అమాంతం పెంచుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది పంత్ సంపాదన రూ.100 – 120 కోట్లుగా నమోదైంది.
4. జస్ప్రీత్ బుమ్రా : ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరున్న బుమ్రా సంపాదనలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. బీసీసీఐ ‘ఏ+’ గ్రేడ్ కాంట్రాక్ట్, ముంబై ఇండియన్స్ రెటైనర్ ఫీజు, వివిధ బ్రాండ్ డీల్స్ ద్వారా ఈ ఏడాది రూ.90 – 110 కోట్ల వరకు ఆర్జించాడు.
5. హార్దిక్ పాండ్యా : మైదానంలో ఎంత విమర్శలు ఎదురైనా, హార్దిక్ బ్రాండ్ వాల్యూ మాత్రం పెరుగుతూనే ఉంది. లగ్జరీ వాచీలు, ఖరీదైన కార్లంటే ఇష్టపడే హార్దిక్.. ఐపీఎల్, ప్రకటనల ద్వారా ఈ ఏడాది రూ.80 – 100 కోట్ల ఆదాయాన్ని పొందాడు.
6. శ్రేయస్ అయ్యర్ : భారత వన్డే జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న శ్రేయస్ అయ్యర్ ఆదాయం కూడా ఈ ఏడాది భారీగా పెరిగింది. కేకేఆర్, ఇతర స్పాన్సర్‌షిప్ల ద్వారా అతను రూ.70 – 85 కోట్ల వరకు సంపాదించి టాప్ లిస్టులో చేరాడు.
7. పాట్ కమిన్స్ : భారతీయ క్రికెటర్ల తర్వాత అత్యధిక ఆదాయం పొందుతున్న విదేశీ ఆటగాడు పాట్ కమిన్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రూ.18 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్ట్ , ఆస్ట్రేలియా బోర్డు జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో కలిసి ఈ ఏడాది రూ.60 – 75 కోట్లు సంపాదించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
