AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: చలికాలంలో చర్మం మెరిసిపోవాలా? అయితే ఈ ‘మ్యాజికల్ ఆయిల్’ వాడాల్సిందే!

చలికాలంలో చర్మం పొడిబారిపోవడం, పగుళ్లు రావడం సర్వసాధారణం. దాని నుంచి బయటపడడానికి మార్కెట్‌లో దొరికే మాయిశ్చరైజర్లు, రకరకాల వాజిలైన్లు వాడేస్తుంటాం. అవి చర్మాన్ని పొడిబారకుండా కొంత సమయం కాపాడుతాయి. అయితే మన వంటింట్లో ఉండే ఒక అద్భుతమైన నూనె ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతుంది. 

Skin Care: చలికాలంలో చర్మం మెరిసిపోవాలా? అయితే ఈ 'మ్యాజికల్ ఆయిల్' వాడాల్సిందే!
Oil
Nikhil
|

Updated on: Jan 03, 2026 | 6:45 AM

Share

చలికాలం రాగానే చర్మం సహజమైన తేమను కోల్పోతుంది. లోషన్లు, క్రీములు ఎన్ని రాసినా కొద్దిసేపటికే మళ్ళీ చర్మం పొడిబారిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు వాడిన ఒక సహజ సిద్ధమైన చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. అదే ‘ఆవనూనె’. ఘాటైన వాసన ఉన్నప్పటికీ, చర్మ సంరక్షణలో దీనికి సాటిలేదు. చలికాలంలో ఆవనూనె వాడటం వల్ల కలిగే 10 అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం.

  •  నేచురల్ మాయిశ్చరైజర్: ఆవనూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం లోపలి పొరల వరకు వెళ్లి తేమను అందిస్తుంది, తద్వారా చర్మం మృదువుగా మారుతుంది.
  •  టాన్ తొలగిస్తుంది: ఎండ వల్ల కలిగే నలుపును (Tan) తొలగించడంలో ఇది మొనగాడు. ఆవనూనెను శనగపిండి, పెరుగుతో కలిపి ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  •  యాంటీ బాక్టీరియల్ గుణాలు: ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను, దద్దుర్లను నివారిస్తాయి.
  •  వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది: క్రమం తప్పకుండా ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి, వయసు పైబడిన లక్షణాలు త్వరగా రావు.
  •  చర్మ రంధ్రాల శుభ్రత: చర్మంపై పేరుకుపోయిన మురికిని, వ్యర్థాలను తొలగించి రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
  •  రక్త ప్రసరణ మెరుగు: ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి, చర్మం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
  •  పగిలిన పెదవులకు పరిష్కారం: రాత్రి పడుకునే ముందు నాభి (బొడ్డు) లో రెండు చుక్కల ఆవనూనె వేసుకుంటే, పెదవుల పగుళ్లు తగ్గి ఎర్రగా మారుతాయి.
  •  సన్ స్క్రీన్‌లా పనిచేస్తుంది: బయటకు వెళ్ళే ముందు స్వల్పంగా రాసుకుంటే ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతిినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది.
  •  డార్క్ స్పాట్స్ మాయం: ముఖంపై ఉండే నల్లటి మచ్చలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
  • నొప్పుల నుండి ఉపశమనం: చలికాలంలో చర్మంతో పాటు కండరాల నొప్పులు కూడా వేధిస్తాయి. గోరువెచ్చని ఆవనూనె మసాజ్ బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ చలికాలం ఖరీదైన కాస్మెటిక్స్ కంటే మన ఆవనూనెను నమ్మి చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడటం మంచిది.

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
దిగి వస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
దిగి వస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
నేటి నుంచే TET 2026 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ప్రారంభం.. సిద్ధమేనా?
నేటి నుంచే TET 2026 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ప్రారంభం.. సిద్ధమేనా?
షూటింగ్‌లో రాంచరణ్‌కు కోపం తెప్పించిన డైరెక్టర్! ఏమైంది
షూటింగ్‌లో రాంచరణ్‌కు కోపం తెప్పించిన డైరెక్టర్! ఏమైంది
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు..
ఏపీలోని రైతులందరికీ కానుక.. చంద్రబాబు ప్రకటన
ఏపీలోని రైతులందరికీ కానుక.. చంద్రబాబు ప్రకటన
ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు.. పెరగనున్న పొలిటికల్ హీట్
ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు.. పెరగనున్న పొలిటికల్ హీట్