02 January 2026

ఆ హీరో హస్బెండ్ మెటిరియల్.. అలాంటి వారే భర్తగా రావాలి.. హీరోయిన్ ఆషిక

Rajitha Chanti

Pic credit - Instagram

కన్నడ సినీరంగం నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారలలో హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఒకరు. 

అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నాగార్జున సరసన నా సామిరంగ సినిమాతో హిట్టు ఖాతాలో వేసుకుంది.

ఇప్పుడు రవితేజ జోడిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా తనకు కాబోయే భర్త గురించి రివీల్ చేసింది.

పెళ్లి విషయంలో ఆషిక చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తనను గౌరవించే వ్యక్తి కావాలని.. తన కెరీర్ అర్థం చేసుకోవాలని తెలిపింది.

తనకు నటనపై ఉన్న ప్యాషన్ ను ప్రోత్సహించే మనసు ఉండాలని.. లుక్స్ కంటే వ్యక్తిత్వం, మెంటాలిటీ, నిజాయితీ, బాధ్యత ముఖ్యమని అంటుంది ఆషిక.

కుటుంబ విలువలను గౌరవించే వ్యక్తి కావాలని తెలిపింది. అంతేకాకుండా కేరింగ్‌గా, లవింగ్‌గా ఉండాలని, చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ చూపించాలట.

ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో తాను అసలు రాజీపడనని.. క్లీన్ హ్యాబిట్స్ ఉండడం వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని..మనసు బాగుండాలని తెలిపింది.

తాను చూసిన వారిలో కళ్యాణ్ రామ్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పడం గమనార్హం. ఇప్పట్లో పెళ్లిపై ఎలాంటి తొందర లేదని చెప్పుకొచ్చింది ఆషిక.