శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు.. కేంద్రం సంచలన నిర్ణయం..
రక్షణ శాఖ రూ. 79 వేల కోట్ల విలువైన ఆయుధ సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇది భారత త్రివిధ దళాల ఆధునికీకరణకు, స్వయం సమృద్ధి సాధనకు కీలక అడుగుగా చెప్పొచ్చు. పినాకా రాకెట్లు, డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్స్, అస్త్ర మిస్సైల్స్ వంటి అధునాతన వ్యవస్థల సేకరణతో సైన్యం, నావికాదళం, వాయుసేన సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి. దేశ రక్షణ పటిష్టం చేయడమే లక్ష్యం.

త్రివిధ దళాలను ఆధునికీకరించేందుకు, స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల సామర్థ్యాలను పెంచేందుకు రూ. 79 వేల కోట్ల ప్రతిపాదనలకు DAC ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రక్షణ సేకరణ మండలి (సమావేశం జరిగింది. సీడీఎస్,త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన ఆయుధ సేకరణ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ నిర్ణయంతో భారత సైనిక బలగాల సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.
భారత సైన్యం కోసం ఆర్టిలరీ రెజిమెంట్లకు లోయిటర్ మ్యూనిషన్ సిస్టమ్‌లో లెవల్ లైట్ వెయిట్ రాడార్లు, పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ కోసం లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అమ్యూనిషన్, ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ , ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ Mk-IIల సేకరణకు డీఏసీ ఆమోదం తెలిపింది. టార్గెట్లపై ఖచ్చితమైన దాడులకు లోయిటర్ మ్యూనిషన్ టాక్టికల్ ఉపయోగపడనున్నాయి. చిన్న పరిమాణంలో, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను గుర్తించి ట్రాక్ చేయనున్నాయి. లెవల్ లైట్ వెయిట్ రాడార్లు.. ఖచ్చితత్వాన్ని పెంచి కీలకమైన టార్గెట్లను సమర్థవంతంగా ధ్వంసం చేయనున్న లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లు పినాకా సిస్టమ్ రేంజ్ సైన్యానికి అందుబాటులోకి రానుంది. టాక్టికల్ బ్యాటిల్ ఏరియా, హింటర్‌ల్యాండ్‌లోని కీలక ఆస్తులను రక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్ ఉపయోగపడనుంది.
భారత నావికాదళం కోసం బొల్లార్డ్ పుల్ టగ్స్, హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోస్ యాన్‌ప్యాక్, హై ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ లీజింగ్‌కు డీఏసీ ఆమోదం తెలిపింది. నావికాదళ నౌకలు, సబ్‌మెరైన్‌లను హార్బర్‌లో బెర్తింగ్, అన్‌బెర్తింగ్, మాన్యూవరింగ్‌లో BP టగ్స్ సహాయపడనున్నాయి. బోర్డింగ్, ల్యాండింగ్ ఆపరేషన్లలో సురక్షిత కమ్యూనికేషన్‌ను HF SDR వ్యవస్థలు మెరుగుపరచన్నాయి. భారత సముద్ర జలాల్లో నిరంతర ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రెకనైసెన్స్ విశ్వసనీయ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్‌ను HALE RPAS అందించనున్నాయి.
భారత వాయుసేన కోసం ఆటోమేటిక్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్, ఆస్ట్రా Mk-II మిస్సైల్స్, ఫుల్ మిషన్ సిమ్యులేటర్, SPICE-1000 లాంగ్ రేంజ్ గైడెన్స్ కిట్స్ సేకరణకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఏరోస్పేస్ సేఫ్టీలోని లోపాలను పూరించి, అన్ని వాతావరణ పరిస్థితుల్లో హై డెఫినిషన్ రికార్డింగ్‌ను ఆటోమేటిక్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్ అందించనుంది. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సామర్థ్యాన్ని పెంచి, దూరం నుంచే శత్రు విమానాలను నాశనం చేయనున్న మెరుగైన రేంజ్‌తో ఆస్ట్రా Mk-II మిస్సైల్స్ వాయుసేనకు అందుబాటులోకి రానున్నాయి. పైలట్ల శిక్షణను ఖర్చు తగ్గించి, సురక్షితంగా శిక్షణను మెరుగుపరీచేందుకు లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఫుల్ మిషన్ సిమ్యులేటర్ అందుబాటులోకి రానుంది. సుదూర ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని పెంచేందుకు SPICE-1000 వాయుసేనకు అందుబాటులోకి రానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




