Andhra News: ఏపీలోని రైతులందరికీ భారీ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ వేళ ఫ్రీ.. ఫ్రీ
ఏపీలోని రైతులకు గుడ్‌న్యూస్. కొత్త సంవత్సరం వేళ రైతులకు ఉపయోగపడే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 9వరకు ఈ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు మేలు చేకూర్చే ఈ నిర్ణయం ఏంటంటే.. పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

New Pattadar Passbooks: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేళ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త అందించింది. రైతులు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం అందించిన పాస్‌బుకుల్లో జగన్ ఫొటోను ముద్రించారు. ప్రభుత్వ లోగో కాకుండా జగన్ ఫొటోను పాస్‌బుక్‌లపైన పొందుపర్చడంపై టీడీపీ విమర్శలు చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లను అందించడంపై దృష్టి పెట్టింది. కేవలం రాష్ట్ర అధికారిక లోగోతో కొత్త పాస్‌బుక్ ఉండనుండగా.. దీనికి సంబంధించిన నమూనాలను కూటమి ప్రభుత్వం గతంలో విడదల చేసింది. ఈ నమూనా ప్రకారం కొత్త బుక్‌లను ముద్రించి రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ఇందుకు తాజగా ముహూర్తం ఖారారు అయింది.
జనవరి 9లోపు ముగింపు
ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జనవరి 9వ తేదీలోపు రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సోమవారం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సెక్రటేరియట్‌లో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జనవరి 9లోపు రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లను అందిస్తామని స్పష్టం చేశారు. 21.8 లక్ష పాస్‌బుక్‌లను రాజముద్రతో ముద్రించామని, వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. తప్పులు సరిదిద్దాకే కొత్త బుక్‌లు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
ఎమ్మార్వో కార్యాలయాలకు కొత్త బుక్‌లు
ఇప్పటికే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో ఆఫీసులకు చేరుకున్నాయి. తప్పులు జరగకుండా చూసేందుకు వాటిల్లోని అన్ని వివరాలను క్షుణ్నంగా చూడాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు వాటిని చెక్ చేస్తున్నారు. త్వరలో ఆ ప్రక్రియ ముగియనుండగా.. అనంతరం జనవరి 9లోపు రైతులందరికీ కొత్త డాక్యుమెంట్స్ అందనున్నాయి.
