AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ బీర్ కేవలం రూ.18.. వాటర్ బాటిల్ ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

మందు బాబులకు పండగే.. ఇక్కడ బీర్ ధర కేవలం రూ.18 రూపాయలంటే నమ్ముతారా? కానీ నిజం. ఇక్కడ నీళ్ల బాటిల్ కంటే తక్కువ ధరకే బీరు దొరికుతుంది. కానీ వాటర్ బాటిల్ కొనాలంటే మాత్రం భారీగా వదులుకోవాల్సిందే. ఏ దేశం ఇంత తక్కువ ధరకు బీర్‌ను అందిస్తూ.. వాటర్‌ను ఎక్కువకు అమ్ముతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక్కడ బీర్ కేవలం రూ.18.. వాటర్ బాటిల్ ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Beer Cheaper Than Water
Krishna S
|

Updated on: Dec 29, 2025 | 7:03 PM

Share

సాధారణంగా ఏ దేశంలోనైనా పన్నుల కారణంగా మద్యం ధరలు భారీగా ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒక దేశం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ లీటర్ మంచి నీళ్ల బాటిల్ కొనాలంటే వంద రూపాయలు పెట్టాల్సిందే.. కానీ ఒక గ్లాసు బీరు మాత్రం కేవలం 18 రూపాయలకే దొరుకుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇంతకీ ఆ దేశం ఏది? అక్కడ బీరు ఎందుకు అంత చౌకగా దొరుకుతుందో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత చౌకైన బీరు

ఆగ్నేయాసియా దేశమైన వియత్నాంలో మద్యం ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ. ఇక్కడ లభించే స్థానిక బీరును బియా హోయి అని పిలుస్తారు. ఒక గ్లాసు బియా హోయి ధర కేవలం 5 వేల వియత్నామీస్ డాంగ్. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 18 రూపాయలు మాత్రమే. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఇది రూ.20 నుండి రూ.25 వరకు ఉండవచ్చు. వియత్నాంలో ఒక సీల్డ్ వాటర్ బాటిల్ ధర సుమారు 30 వేల డాంగ్ అంటే రూ.100. నీళ్ల బాటిల్ కంటే ఐదు రెట్లు తక్కువ ధరకు ఇక్కడ బీరు లభిస్తుంది.

బీరు అంత చౌకగా ఎందుకు దొరుకుతుంది?

వియత్నామీస్ బీరు ఇంత తక్కువ ధరకు లభించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. బియా హోయిని స్థానికులు సొంతంగా తయారు చేస్తారు. ఇది సీసాల్లో లేదా డబ్బాల్లో ప్యాక్ చేయబడదు. దీనిని పెద్ద బ్యారెల్స్‌లో నిల్వ చేస్తారు. ప్రతిరోజూ తాజాగా తయారు చేసి గంటల వ్యవధిలోనే విక్రయిస్తారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఖర్చులు లేకపోవడంతో ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ బీరు తయారీ వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఈ చౌక ధరల వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వియత్నాంకు క్యూ కడుతుంటారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లో గోవానే టాప్

మన దేశం విషయానికి వస్తే మద్యం ప్రియుల మొదటి ఎంపిక గోవా. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే గోవాలో మద్యం, బీరు ధరలు చాలా తక్కువ. పన్నుల మినహాయింపు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గోవాలో మద్యం చౌకగా దొరుకుతుంది. అందుకే పర్యాటకులు అక్కడ పార్టీలను, స్థానిక బీరును ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి