స్త్రీ లేదా పురుషుడు.. తులసి మొక్క ఎవరు నాటడం మంచిదో తెలుసా?

Samatha

29 December 2025

హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు.

లక్ష్మీదేవి , విష్ణు మూర్తి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ రోజూ తులసి మొక్కను పూజిస్తుంటారు. ఇక కార్తీక మాసం, శ్రావణ మాసంలో దీనిని ఇంటిలో నాటుకుంటారు.

అయితే తులసి మొక్క చాలా పవిత్రమైనది. మరి దీనిని స్త్రీ లేదా పురుషుడు ఎవరు ఇంటిలో నాటడం మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

చాలా వరకు ప్రతి ఇంటిలో వివాహమైన స్త్రీలు తులసి మొక్కను నాటి, ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు. దీని వలన ఆ స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని అంటారు.

అంతే కాకుండా ఎవరి ఇంటిలో అయితే నిత్యం తులసి చెట్టును పూజిస్తారో వారి ఇంటిలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. నెగటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది.

ఇక తులసి మొక్కను స్త్రీలే నాటుతారు. అయితే పురాణాల ప్రకారం పురుషులు నాటాలి, స్త్రీలు నాటకూడదని ఎక్కడా లేదు కాబట్టి, దీనిని ఎవరు నాటినా మంచిదేనంట.

ముఖ్యంగా స్త్రీలు తులసి మొక్కను నాటడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుందని, అలాగే ఆ ఇళ్లు సుఖశాంతులతో తులతూగుతుందని చెబుతారు పండితులు.

అయితే మహిళలు పీరియడ్స్ సమయంలో తులసి మొక్కను నాటడం అశుభకరం, ఈ సమయంలో పురుషులు నాటడం చాలా మంచిదంట.