వైకుంఠ ఏకాదశి.. హైదరాబాద్‌లో తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాలు ఇవే!
Samatha
29 December 2025
వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30న జరుపుకోనున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
వైకుంఠ ఏకాదశి రోజున తప్పక సందర్శించాల్సిన ఆలయాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్. హైదరాబాద్‌లోని ఫేమస్ టెంపుల్స్‌లో ఇదొక్కటి.
వైకుంఠ ఏకాదశి రోజున వాసుదేవుడికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అందుకే తప్పకుండా ఈ రోజున ఇస్కాన్ టెంపుల్ సందర్శించాల్సిందే.
ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని వారు నగరం మధ్యలో ఉన్న బిర్లా మందిర్, వైకుంఠ ఏకాదశి రోజు సందర్శించాల్సిన ఆలయాల్లో ఒకటి.
అతి పూరతనమైన ఆలయాల్లో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఇది జియాగూడ పూరానాపూల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వైకుంఠ ద్వారా దర్శనం కలుగుతుంది.
హైదరాబాద్‌లో ఉన్న ఫేమస్ టెంపుల్స్‌లో శ్రీ జగన్నాథ టెంపుల్. ఇక్కడ భగవాన్ విష్ణు అవతారంగా భావించి పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడి చాలా మంది భక్తులు వస్తారు.
అలవ్వాల్‌లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందువలన ఈరోజు తప్పకుండా సందర్శించాల్సిన ఆలయాల్లో ఇదొక్కటి.
అదే విధంగా హిమాయత్ నగర్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందువలన వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడికి వెళ్లడం శుభ ప్రదం.