AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న

మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Dec 28, 2025 | 6:43 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళిల ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముఖ్యంగా జపాన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూ.100 కోట్లు రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మునుపటి చిత్రాలైన RRR, బాహుబలి విజయాలను వాడుకుంటూ, ఈ అడ్వెంచర్ డ్రామాను భారీ ప్రమోషన్స్‌తో గ్లోబల్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇన్నాళ్లూ ఓవర్సీస్ అంటే అమెరికా వైపు మాత్రమే చూసిన మన దర్శక నిర్మాతల కళ్లు ఇప్పుడు జపాన్ వైపు కూడా చూస్తున్నాయి. కరెక్టుగా లెక్కేసి కొడితే అక్కడ్నుంచి కూడా 100 కోట్లు ఈజీగా వసూలు చేయొచ్చంటున్నారు హీరోలు. అందుకే వారణాసి విషయంలో ఇలాంటి మాస్టర్ ప్లానే సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. మరి ఆయనేం చేస్తున్నారో చూద్దామా..? సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా.. గ్లోబల్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై మరో మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది. మామూలుగానే రాజమౌళి తన సినిమాను కేవలం ఇండియాతో ఆపరు.. అందుకే వారణాసిని ఏకంగా 100కు పైగా దేశాల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా సత్తా మరోసారి వరల్డ్ సినిమాకు చాటిచెప్పేలా.. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ అడ్వెంచర్ డ్రామాను రూపొందిస్తున్నారు జక్కన్న. వారణాసికి సంబంధించి ఓ అప్డేట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోందిప్పుడు. జపాన్ మార్కెట్‌పై ఇప్పట్నుంచే పోకస్ చేసారు మేకర్స్. అక్కడ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఐమ్యాక్స్ జపాన్ తమ సోషల్ మీడియాలో ఈ సినిమా గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. 2027లో రిలీజ్ కానుందని పేర్కొన్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి ఆల్రెడీ జపాన్‌లో బాగానే ఫేమస్. జపాన్ రిలీజ్ మాత్రమే కాదు.. ప్రమోషనల్ ఈవెంట్లను కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ క్రేజ్‌ను వారణాసి కోసం వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్. జక్కన్న క్రేజ్‌కు మహేష్ ఛరిష్మా తోడైతే జపాన్ బాక్సాఫీస్‌కి చెమటలు పట్టడం ఖాయం. మొత్తానికి 2027లో జపాన్ గడ్డపై తెలుగు సినిమా జెండా మరోసారి రెపరెపలాడబోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Published on: Dec 28, 2025 06:42 PM