Team India Womens: టీమిండియా మెరుపులు.. నాలుగో టీ20 కూడా మనదే..
ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఉమెన్స్ గెలుపొందింది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో గెలిచి నాలుగో టీ20లో కూడా విజయం సాధించింది. ఇప్పటికే జరిగిన మూడు టీ20ల్లోనూ భారత్ ఉమెన్స్ గెలిచారు. ఇప్పుడు నాలుగో టీ20లో కూడా గెలిచి సత్తా చాటింది.

ఆదివారం శ్రీలంక ఉమెన్స్‌తో జరిగిన నాలుగో టీ20లో కూడా టీమిండియా ఉమెన్స్ గెలుపు జెండా ఎగురవేసింది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 221-2 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 191-6 పరుగులే చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన మూడు టీ20ల్లో భారత్ గెలవగా.. నాలుగో టీ20 కూడా తన ఖాతాలో వేసుకుంది. దీంతో శ్రీలంకపై 4-0 ఆధిక్యంతో కొనసాగుతోంది.
స్మృతి మంధాన రికార్డ్
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 80, షెఫాలీ వర్మ 79 పరుగులతో రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌తో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రికార్డు సాధించింది. అంర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో 10 వేల పరుగులు చేసిన రెండో భారత మహిళా బ్యాటర్‌గా నిలిచింది. తొలుత భారత్ బ్యాటింగ్‌కు దిగగా.. స్మృతి మంధాన 48 బంతుల్లో 80, షపాలీ వర్మ 46 బంతుల్లో 79, రిచా హోష్ 16 బంతుల్లో 40, హర్మన్ ప్రీత్ కౌర్ 10 బంతుల్లో 16 పరుగులు చేశారు. దీంతో భారత్ మొత్తం 20 ఓవర్లకు 221-2 పరుగులు చేసింది.
