AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా

సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 28, 2025 | 6:47 PM

Share

2026 సంక్రాంతికి ఏకంగా 7 సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. తెలుగు నుండి ఐదుగురు స్టార్ హీరోలు, తమిళం నుండి ఇద్దరు అగ్రనటులు తమ చిత్రాలతో రాబోతున్నారు. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి వారి సినిమాలు ఒకేసారి వస్తుండటంతో థియేటర్ల పంపకం పెద్ద సమస్యగా మారనుంది. స్క్రీన్ల కోసం నిర్మాతల మధ్య తీవ్ర పోటీ, యుద్ధం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

సంక్రాంతికి మరీ ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయా..? తెలుగు నుంచే ఐదుగురు హీరోలు రేసులో ఉన్నారు. ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించట్లేదు.. ప్రమోషన్స్ కూడా షురూ చేసారు. తమిళం నుంచి మరో ఇద్దరు వస్తున్నారు. అంటే మొత్తం 7 సినిమాలన్నమాట. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? థియేటర్స్ ఎలా పంచుకుంటారు..? తెలుగుకే సరిపోవట్లేదంటే తమిళం సినిమాలకు థియేటర్లు ఇస్తారా..? సంక్రాంతికి రావడమనేది హీరోలు ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే.. అది కచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే.. 2026 పొంగల్ చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న రాబోతుంది. ఇక జనవరి 9న రాజా సాబ్ వస్తున్నాడు. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. అలాగే జనవరి 14న అనగనగా ఒకరాజు విడుదల కానుంది. ఈ మధ్యలో జనవరి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14 సాయంత్రం 5.49 గంటలకు శర్వానంద్ నారినారి నడుమ మురారి సినిమాలు రానున్నాయి. వీటితో పాటు విజయ్ జన నాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి పండక్కే వస్తున్నాయి. ఒకేసారి పండక్కి 7 సినిమాలు వస్తే థియేటర్స్‌కు చాలా పెద్ద ఇష్యూ తప్పదు. ప్రతీసారి పొంగల్‌కు కనీసం 4 సినిమాలు బరిలో ఉంటాయి. వాటికే థియేటర్స్ సర్దేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు నిర్మాతలు. మా సినిమాకు తక్కువొచ్చాయి.. వాళ్లను తొక్కేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అలాంటిది 2026 పొంగల్‌కు ఏకంగా 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి ప్రభాస్ సినిమాకు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. అదేరోజు రాబోతున్న జన నాయగన్‌కు మంచి స్క్రీన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తర్వాత చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్.. నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ లాంటి కుర్ర హీరోలకు స్క్రీన్స్ ఎలా వస్తాయనేది చూడాలిక. ఈ సారి నిర్మాతల మధ్య పెద్ద యుద్ధం తప్పేలా లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు