Jr.NTR: ఎన్టీఆర్తో సూపర్ హిట్ సినిమా.. ఇండస్ట్రీలోకి వచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడేం చేస్తుందంటే..
సాధారణంగా సినీరంగంలో కొందరు హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితమవుతుంటారు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ అడియన్స్ హృదయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని తోపు హీరోయిన్. అతి తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అడియన్స్ హృదయాల్లో మాత్రం చెరగని స్థానం సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. అలాగే ఆమె నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. తనే గజాల.
విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో 2001లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గజాల. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్, అల్లరి రాముడి వంటి చిత్రాల్లో నటించింది. చివరగా జానకి వెడ్స్ శ్రీరామ్ అనే సినిమాలో కనిపించింది గజాల. అవకాశాలు తగ్గిపోవడంతో వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి మూవీలో గెస్ట్ రోల్ చేసింది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2002లో సూసైడ్ అటెంప్ట్ చేసింది గజాల. 2002 జూలై 22న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన సహ నటులు సుల్తానా, అర్జున్ ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. బ్రతికి బయటపడింది. అయితే ఆమె ఆత్మహత్య ప్రయతానికి ప్రేమ వ్యవహారమే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉన్న గజాల.. హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన గజాలా.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడం లేదు.
ఇవి కూడా చదవండి :