- Telugu News Photo Gallery Cinema photos Jailer first part characters Will the from the of continue in part 2?
Jailer 2: జైలర్ 2 స్టేటసేంటి.? ఆ పాత్రలు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతాయా.?
చాలా రోజులు తరువాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. సరైన సినిమా పడితే రజనీ అభిమానులు జోరు ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. అందుకే ఆ సినిమా సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ పార్ట్ 2 స్టేటసేంటి..;? తొలి భాగంలో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతాయా..? ఈ స్టోరీలో చూద్దాం.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 15, 2025 | 4:08 PM

జైలర్ సినిమాకు సీక్వెల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసిన మూవీ టీమ్, ఆ ఎనౌన్స్‌మెంట్ టీజర్‌లో రజనీకాంత్‌ను మాత్రమే చూపించారు. దీంతో పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్‌లో కనిపిస్తాయా.లేదంటే ముత్తువేల్ పాండియన్ క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకొని కొత్త కథను డిజైన్ చేశారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

సీక్వెల్ విషయంలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు సీనియర్ నటి రమ్యకృష్ణ. రీసెంట్‌గా జైలర్ 2 సెట్లో అడుగు పెట్టిన ఈమె, మరోసారి ముత్తువేల్ పాండియన్ భార్యగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు నరసింహ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్లు పూర్తయిన రోజే ఈ సినిమా షూట్‌లో జాయిన్ అవ్వటం మరింత ఆనందంగా ఉందన్నారు.

కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాదు తొలి భాగంలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన మిర్న మీనన్ కూడా సీక్వెల్‌లో కనిపించబోతున్నారు. అలాగే పార్ట్ 1లో నటించిన మరి కొందరు కూడా పార్ట్ 2లో కనిపించున్నారు.

ఈ అప్‌డేట్స్ తరువాత జైలర్ 1 కథ ఎక్కడ ముగిసిందో, పార్ట్ 2 కథ అక్కడి నుంచే మొదలు పెట్టాలే దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేశారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 2 కూడా తొలి భాగం రేంజ్‌లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటె జైలర్ పార్ట్ 1 మ్యూజిక్ కి మంచి క్రేజ్ రావడంతో పార్ట్ 2లో కూడా అనిరుద్‌నే సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసారు. సినిమా ఎనౌన్స్‌మెంట్ టీజర్‌లో తలైవతో పాటు అనిరుద్, దర్శకుడు నెల్సన్ కూడా కనిపించారు .





























