- Telugu News Photo Gallery Cinema photos South directors who have achieved success in the North has a similarity in their films
South Directors: సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. నార్త్‌లో సౌత్ దర్శకుల సక్సెస్ ఫార్ములా..
ఈ మధ్య కాలంలో సౌత్ దర్శకులు నార్త్ మార్కెట్‌ను రూల్ చేస్తున్నారు. అక్కడ వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో నార్త్ మార్కెట్‌ను షేక్ చేసిన సౌత్ దర్శకుల సినిమాల విషయంలో ఓ ఇంట్రస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది. ఏంటా సిమిలారిటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
Updated on: Apr 15, 2025 | 4:08 PM

నార్త్‌లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ మూవీ జాట్. ఈ సినిమాను తెరకెక్కించింది సౌత్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని. అందుకే జాట్ సినిమా కథ గోపి తెరకెక్కించిన క్రాక్ కథకు సిమిలర్‌గా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

క్రాక్ సినిమాలో హీరో విలన్‌ల మధ్య ఫైట్ ఓ మేకు, మామిడికాయ, కరెన్సీ నోటు కారణంగా మొదలవుతుంది. ఈ చిన్న పాయింట్ కోసమే ఓ ఏరియాను శాసించే విలన్‌ను ఎదుర్కొంటాడు మన హీరో.

జాట్ సినిమాలో కూడా అలాంటి ఓ సిల్లి పాయింట్ వల్లే హీరో విలన్ మధ్య యుద్ధం మొదలవుతుంది. తను తినే ఇడ్లీ ప్లేట్ పడేసిన విలన్లు సారీ చెప్పకపోవటంతో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ మెయిన్ విలన్ వరకు వెళతాడు హీరో. అక్కడ కూడా విలన్ ఓ ఏరియాను శాసించే రేంజ్‌లోనే కనిపిస్తాడు.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా తనకు సౌత్‌లో వర్కవుట్ అయిన ఫార్ములానే నార్త్‌లో అప్లై చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం వైలెంట్‌గా బిహేవ్ చేస్తాడు హీరో.

యానిమల్ సినిమాలో తండ్రి మీద ప్రేమతో వైలెంట్‌గా మారతాడు హీరో. ఇలా సౌత్‌లో వర్కవుట్ అయిన ఫార్ములాస్‌నే ఇంకాస్త మసాలాతో నార్త్ ఆడియన్స్‌కు చూపించిన సక్సెస్‌లు కొడుతున్నారు మన మేకర్స్.

అట్లీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. తనకు సౌత్‌లో బాగా కలిసొచ్చిన ఫాదర్ సెంటిమెంట్‌తోనే నార్త్ మూవీ చేశారు. తెరి, మెర్సల్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే జవాన్‌లోనూ అదే లైన్ తీసుకున్నారు అట్లీ. ఈ ఫార్ములా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి పెట్టింది.




