- Telugu News Photo Gallery Cinema photos Prabhas Varsham to Rajinikanth Jailer 2 latest movie news from film industry
Tollywood News: వర్షం రీ రిలీజ్‌కు రంగం సిద్ధం.. జైలర్ 2 షూటింగ్ అప్‌డేట్..
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ వర్షం రీ రిలీజ్‌కు సిద్ధం. కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అజిత్ హీరోగా తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ రికార్డు. థగ్‌లైఫ్ వర్క్ ఫినిష్ కావటంతో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. జైలర్ 2 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు సీనియర్ నటి.
Updated on: Apr 15, 2025 | 4:08 PM

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ వర్షం. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమాను రీ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మే 23న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం సినిమాలో త్రిష, ప్రభాస్‌కు జోడీగా నటించారు.

కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అనుపమా పరమేశ్వరన్‌తో ధృవ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ కావటంతో ఈ రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే అది బైసన్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫిక్స్ అని క్లారిటీ ఇచ్చింది ధృవ్ టీమ్.

అజిత్ హీరోగా తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. వరుస ఫెయిల్యూర్స్ తరువాత అజిత్ బిగ్ హిట్ అందుకోవటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

థగ్‌లైఫ్ వర్క్ ఫినిష్ కావటంతో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జైలర్ 2 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు సీనియర్ నటి రమ్యకృష్ణ. ఈ నెల 10వ తేదిన తాను సెట్‌లో అడుగుపెట్టానని, ఆ రోజుకు నరసింహ సినిమా రిలీజ్ అయి 26 సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేసుకున్నారు. జైలర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్.




