AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాన్వీ కపూర్‌ను తొక్కేస్తున్నారా..! ఇండస్ట్రీలో రాజకీయం పై జాన్వీ షాకింగ్ కామెంట్స్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది జాన్వీ కపూర్.మొన్నటివరకు హిందీలో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జాన్వీ కపూర్‌ను తొక్కేస్తున్నారా..! ఇండస్ట్రీలో రాజకీయం పై జాన్వీ షాకింగ్ కామెంట్స్
Janhvi Kapoor
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2025 | 4:46 PM

Share

బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. మొన్నటివరకు బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ అమ్మడు.. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. వీటితో పాటే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పురుష అహంకారం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జాన్వీ రీసెంట్ గా టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్ ట్వింకిల్‌’ టాక్‌ షోలో పాల్గొంది. జాన్వీతో పాటు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ షోలో పాల్గొన్నారు ఈ షోలో జాన్వీ మాట్లాడుతూ.. ” నేను సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను.. అయినా కూడా కొన్ని విషయాలు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. ఇక్కడ రాణించాలంటే అహంకారాన్ని ముఖ్యంగా పురుష అహంకారాన్ని ఎదుర్కోవాల్సిందే.. నలుగురు ఆడవాళ్లు ఉన్న ప్లేస్‌లో నేను దైర్యంగా మాట్లాడగలను. నా అభిప్రాయాన్ని బయట పెట్టగలను. అదే నలుగురు మగవాళ్లు ఉన్న దగ్గర నేను దైర్యంగా మాట్లాడలేను.. ఎందుకంటే ఆ మగాళ్లు ఫీల్ అవ్వకుండా వాళ్ల ఈగో హర్ట్ అవ్వకుండా నేను నా అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలంటే చాలా నేర్పు ఉండాలి అని తెలిపింది.

అలాగే మనలో ఎంత టాలెంట్ ఉన్నా.. మనం ఎంత గొప్పగా నటించగలిగినా.. అవతలి వారికోసం కొంచం తగ్గి నటించాల్సి ఉంటుంది. అంతే కాదు కొన్నిసార్లు మనకు ఏదైనా నచ్చకపోతే.. నాకు నచ్చలేదు.. నేను చేయను అని చెప్పం దానికి బదులు నాకు అర్ధం కాలేదు అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ రాణించాలి అంటే కొన్ని రాజకీయాలను ఎదుర్కోవాల్సిందే అని జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Posts from the bollyblindsngossip community on Reddit

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి