AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డుల బద్దలు కొడుతోన్న తెలుగు హారర్ థ్రిల్లర్

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఇక్కడ కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. శుక్రవారం (అక్టోబర్ 24) తెలుగు కాకుండా మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. మొదటి వారంలోనే అరుదైన 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు అందుకుంది.

OTT Movie: థియేటర్లలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డుల బద్దలు కొడుతోన్న తెలుగు హారర్ థ్రిల్లర్
Ott Movie
Basha Shek
|

Updated on: Oct 25, 2025 | 7:29 PM

Share

ఒక్కోసారి థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో పెద్దగా ఆడవు. థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ఓటీటీలో ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఓటీటీలోనూ రెంటల్ బేసిస్ విధానం. ఈ కారణాలతో చాలా సినిమాలు థియేటర్లలో ఆడినప్పటికీ ఓటీటీలో ఆడడం లేదు. అయితే ప్రస్తుతం ఓటీటీల్లో హారర్, థ్రిల్లర్ సినిమాలదే హవా. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రికార్డులు బద్దలు కొడుతోంది. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. బిగ్ స్క్రీన్ పై మాదరిగానే డిజిటల్ స్ట్రీమింగ్ పైనా రికార్డులు బద్దలు కొడుతోంది. సరికొత్త కథా కథనాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అద్దిరిపోయే ట్విస్టులున్న ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ కు కూడా మంచి థ్రిల్ అందిస్తోంది. గత శుక్రవారం అంటే అక్టోబర్ 17న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కాగా.. తొలి వారంలోనే 100 మిలియన్ల అంటే 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. అది కూడా కేవలం తెలుగు భాషలో మాత్రమే

ఈ శుక్రవారం (అక్టోబర్ 24) నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. దీంతో ఈ మూవీ మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా అనుపమా పరమేశ్వరన్ దయ్యంగా భయపెట్టించిన కిష్కింధ పురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. మిరాయ్ వంటి బ్లాక్ బస్టర సినిమా పోటీని తట్టుకుని నిలబడి ఏకంగారూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించాడు. సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్..

జీ5లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.