AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: సల్మాన్ ఖాన్ మద్యం తాగి బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చాడా? వీడియో వైరల్

బిగ్ బాస్ హిందీ సీజన్ 19 వారాంతపు ఎపిసోడ్‌ను సల్మాన్ ఖాన్ తాగి హోస్ట్ చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ఈ షోలో సల్మాన్ ముఖం బాగా ఉబ్బిపోయింది. కళ్లు కూడా వాచి పోయాయి. దీంతో కొందరు సల్మాన్ మద్యం తాగి బిగ్ బాస్ కు వచ్చాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Bigg Boss: సల్మాన్ ఖాన్ మద్యం తాగి బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చాడా? వీడియో వైరల్
Salman Khan
Basha Shek
|

Updated on: Oct 23, 2025 | 10:30 PM

Share

బిగ్ బాస్ హిందీ రియాలిటీషోకు ఎప్పటినుంచో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన హోస్టింగ్ తో ఈ సెలబ్రిటీ రియాలిటీ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా వారాంతంలో సల్మాన్ హాజరయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ షోలో సల్లూ భాయ్ ధరించే దుస్తులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ మద్యం తాగి హోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఈ షోలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా అతని ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించింది. కళ్లు కూడా వాచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన చాలా మంది సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని విమర్శించారు. అయితే దీనిని సల్మాన్ అభిమానులు ఖండిస్తున్నారు. ఈ మేరకు సల్మాన్ బిహేవియర్ పై ఓ క్లారిటీ కూడా ఇస్తున్నారు.

కాగా మహాభారత్ హిందీ సీరియల్‌లో నటించిన పంకజ్ ధీర్ ఇటీవలే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆ తర్వాత రియాద్ వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్, షారుఖ్ ఖాన్‌లతో పాటు సల్మాన్ ఖాన్ వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత, అక్కడి నుంచి నేరుగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు వచ్చాడు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్రపోలేదు. అందుకే అతని కళ్ళు ఉబ్బిపోయాయి. నిద్ర లేకపోవడం వల్ల అతను సరిగ్గా నిలబడలేకపోయాడు కూడా. ఈ క్రమంలోనే కొంతమంది సల్మాన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో సల్మాన్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!
ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!
హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!
హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!
హాయిగా..జాలీగా..వేసవిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలుఇవే
హాయిగా..జాలీగా..వేసవిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలుఇవే
సింపుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే మీలో కాల్షియం లోపం ఉన్నట్లే..
సింపుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే మీలో కాల్షియం లోపం ఉన్నట్లే..
ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!
ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం