AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ఉపాసనకు రెండోసారి ప్రెగ్నెన్సీ.. మళ్లీ తప్పిన వేణుస్వామి జ్యోతిష్యం.. గతంలో ఏం చెప్పాడో తెలుసా?

సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణు స్వామి గతంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి కూడా జోష్యం చెప్పారు. ముఖ్యంగా మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల భవిష్యత్ ఎలా ఉంటుందో వివరించారు. అయితే ఓ కీలక విషయంలో మాత్రం వేణు స్వామి అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

Ram Charan: ఉపాసనకు రెండోసారి ప్రెగ్నెన్సీ.. మళ్లీ తప్పిన వేణుస్వామి జ్యోతిష్యం.. గతంలో ఏం చెప్పాడో తెలుసా?
Ram Charan, Venu Swamy
Basha Shek
|

Updated on: Oct 24, 2025 | 5:14 PM

Share

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. మరికొన్ని రోజుల్లో ఉపాసన కు జంట కవలలు పుట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఉపాసనకు సీమంతం ఘనంగా నిర్వహించారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు కామినేని కుటుంబీకులు ఈ వేడుకకు హాజరయ్యారు. రెండోసారి తల్లిగా ప్రమోషన్ పొందనున్న ఉపాసనను మనసారా అశీర్వదించారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్- ఉపాసన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరొందిన వేణుస్వామి గతంలో రామ్ చరణ్- ఉపాసనల కూతురు క్లింకారపై ఓ వీడియో రిలీజ్ చేశారు. మెగా ప్రిన్సెస్ భవిష్యత్ పై జోస్యం చెప్పారు. ఉపాసన రెండోసారి గర్భం ధరించిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో వేణు స్వామి ఏం చెప్పారంటే..

‘క్లింకార పుట్టిన సమయం అద్భుతంగా ఉంద. తన జాతకంలో రాజయోగం ఉంది. ఆ చిన్నారి రాక మెగా కుటుంబానికి అదృష్టం తీసుకువస్తుంది. చిరంజీవికి గారికి ఉన్నటువంటి యోగమే ఈ పాపకు కూడా ఉంది. పాప పెరిగి పెద్దయిన తరువాత చరిత్ర సృష్టించే అవకాశాలు ఆమె జాతకంలో కనిపిస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనకు ఉన్నంత పేరు క్లింకార కూడా సంపాదిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు వేణు స్వామి మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. క్లింకార తర్వాత ఉపాసన- రామ్ చరణ్ కు ఇంకో సంతానం ఉండకపోవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతంలో రామ్ చరణ్, ఉపాసన, క్లింకారల గురించి వేణుస్వామి చేసిన వీడియో..

అయితే ఇప్పుడు రామ్ చరణ్- ఉపాసన గుడ్ న్యూస్ చెప్పడంతో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పిందని తెలుస్తోంది. ఒక్కరు కాదు ఈసారి ఉపాసన ట్విన్ బేబీస్ కి జన్మనివ్వబోతున్నారని శుభవార్త చెప్పారు. దీంతో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పిందంటున్నారు నెటిజన్లు. మరి దీనిపై వేణు స్వామి ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఉపాసన సీమంతం వేడుక.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై