AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Chapter 1 OTT: కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ అప్డేట్.. 800 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే!

రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార ఛాప్టర్ 1. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఒక అప్డేట్ వచ్చింది.

Kantara Chapter 1 OTT: కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ అప్డేట్.. 800 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kantara Chapter 1 Movie
Basha Shek
|

Updated on: Oct 26, 2025 | 1:38 PM

Share

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు వసూళ్లు సాధిస్తోంది. సినిమా రిలీజై మూడు వారాలు దాటిపోయినా కాంతార ప్రభంజనం ఆగడం లేదు. చాలా చోట్ల ముఖ్యంగా కర్ణాటకలో ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. కొత్త సినిమాలు రిలీజైనా కాంతార కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. తద్వారా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రికారడుల కెక్కింది. కాగా ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న కాంతార ఛాప్టర్ 1 సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ వారంలోనే కాంతార ఛాప్టర్ 1 ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందట.

కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం దర్శక నిర్మాతలకు రూ. 125 కోట్లు చెల్లించినట్లు సమచాఆరం. ఈ నేపథ్యంలో అన్నీ కుదిరితే అక్టోబర్ 30న లేదా నవంబర్ మొదటి వారంలో కాంతారా ఛాప్టర్ 1 సినిమా ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ !

హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన కాంతార ఛాప్టర్ 1 సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళ నటుడు జయరామ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమకు స్వరాలు అందించారు.

కాంతార ఛాప్టర్ 1 సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.