ఎన్నాళ్లకు కనిపించింది మావ..! హీరోయిన్‌గా బిగ్ బాస్ బ్యూటీ..!! ఎవరో గుర్తుపట్టారా.?
బిగ్ బాస్ సీజన్ 9లోకి కొత్త హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రచ్చ డబుల్ అయ్యింది. కొంతమంది గొడవలతోనే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది టాస్క్ ల్లో తమ సత్తా చాటుతున్నారు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారో చూడాలి

బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. కానీ ఆమె ప్రవర్తన కారణంగా ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో కంటే ముందు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. కానీ బిగ్బాస్ తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఎక్కడా పెద్దగా కనిపించలేదు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేసిన కూడా ఎంతో అంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడు ఏమైపోయిందా అని అందరూ అనుకుంటుండగా.. సడన్ గా హీరోయిన్ అవతారమెత్తింది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? పేరు చేతే ఓహో ఈ అమ్మడా అని ఆశ్చర్యపోతారు. ఇంతకూ ఆమె ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న అమ్మడు మరెవరో కాదు.. రతికా రోజ్.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులలో చురుగ్గా ఉండే రతిక.. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. మోడల్ గా పనిచేసిన రతిక..
2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాతో కథానాయికగా మారింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. ఆ తర్వాత బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత బిగ్బాస్ షోలోకి అడుగుపెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకోవాలని అనుకుంది. కానీ ఊహించని విధంగా బిగ్బాస్ షోతో ఆమెకు ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రతిక. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో నెటిజన్లకు మతిపోగొడుతుంది. తాజాగా ఈ భామ హీరోయిన్ గా నటిస్తున్న మరో సినిమా రాబోతుంది. ఎక్స్ వై అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సీవీ కుమార్ పిజ్జా, సూదు కవ్వుమ్, ఇరుది సుట్రు వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించారు. అలాగే దర్శకుడిగా మాయవన్ అనే సినిమా చేశారు. తాజాగా ఎక్స్ వై నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








