AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 ఏళ్లతర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ.. మెగాస్టార్ సినిమాతో కమ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి తన విలక్షణమైన కథల ఎంపిక మరియు మేకోవర్‌లతో యువ తరంతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక సినిమా నుండి మరొక సినిమాకు భిన్నమైన జానర్‌లను ఎంచుకోవడంతో పాటు, తన లుక్స్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

9 ఏళ్లతర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ.. మెగాస్టార్ సినిమాతో కమ్ బ్యాక్
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2025 | 4:46 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతోపాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మన  శంకరవరప్రసాద్ గారు అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. చిరంజీవి చివరిగా నటించిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహారమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది. విశ్వంభర సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా శ్రీ రామనవమి రోజున ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని తెలుస్తుంది. అలాగే ఓ అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు ప్రేమకావాలి సినిమాతో పరిచయమైన ఇషా చావ్లా. ఆదిసాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమకావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ఇషా చావ్లా. తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైంది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!