AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా..! బిగ్ బాస్‌లోకి శ్రీజతో పాటు అతను కూడా రీ ఎంట్రీ..

బిగ్ బాస్ సీజన్ 9లోకి కొత్త హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రచ్చ డబుల్ అయ్యింది. కొంతమంది గొడవలతోనే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది టాస్క్ ల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ వారం కెప్టెన్ అయ్యే హౌస్ మేట కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇచ్చాడు.

ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా..! బిగ్ బాస్‌లోకి శ్రీజతో పాటు అతను కూడా రీ ఎంట్రీ..
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2025 | 7:08 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 మంచి రసవత్తరంగా సాగుతుంది. గొడవలు, వాదనలు, అరుపులు ఏడుపులతో పేక్షకులను అలరిస్తుంది. కొత్త హౌస్ మేట్స్ రావడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. ఇక వారం వారం నామినేషన్స్, ఎలిమినేషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. కామనర్స్ , సెలబ్రెటీల మధ్య హౌస్ లో రచ్చ మాములుగా జరగడం లేదు. సెలబ్రెటీలతో పోల్చుకుంటే హౌస్ నుంచి బయటకు వెళ్లిన వారిలో కామనర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లోకి ఇద్దరు కామనర్స్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన వారిలో దమ్ము శ్రీజ ఒకరు. ఈ అమ్మడు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

దమ్ము శ్రీజ హౌస్ లో తన మాటలతో హౌస్ మెంబర్స్ ను బెంబేలెత్తించింది. గేమ్ కంటే నోటితోనే ఈ చిన్నది ఎక్కువగా పని చెప్పింది.. దాంతో ఆడియన్స్ కు చిరాకు వచ్చింది. దాంతో ఓట్లు తక్కువ పడటంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.  శ్రీజతో పాటు మరో కామనర్ కూడా హౌస్ లోకి రానున్నాడని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

అతను ఎవరో కాదు మాస్క్ మ్యాన్ హరీష్. కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్. తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తన ముక్కుసూటి తనంతో హౌస్ లో ఎన్నో గొడవలు పడుతూ రచ్చ చేశాడు హరీష్. ఇక ఇప్పుడు మాస్క్ మ్యాన్ మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. హరీష్ ఎంట్రీతో హౌస్ లో రచ్చ డబుల్ అవవడం ఖాయం అంటున్నారు ఆడియన్స్. మరి నిజంగా హరీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

హరిత హరీష్ ఇన్ స్టా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.