AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

ఇండస్ట్రీలో ఆమె ఓ తోప్ హీరోయిన్.. తెలుగు సినిమా పేరు చెప్తే ముందు గుర్తుకు వచ్చే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. 13ఏళ్లకు హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత 300సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2025 | 11:25 AM

Share

తెలుగు సినిమాల్లో చెరగని సంతకం చేసిన నటి ఆమె.. ఒకప్పుడు చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సత్తా చాటింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతులేని అభిమానం సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాలతో నటించి సత్తా చాటింది ఆమె. అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. అప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. హీరోయిన్ గా రాణించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. దశాబ్దాలపాటు అనేక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈహీరోయిన్.. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ పలు సినిమాలు చేసింది. సినిమాలతోనే కాకుండా ఇటు రాజకీయాలతోనూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు తనే హీరోయిన్ జయప్రద.. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ అందాల తార. స్కూల్లో ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా చూసి నటుడు ఏం ప్రభాకర్ రెడ్డి ఆమెను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాల నిడివిగల పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు.

అలా మొదలైన సినీ ప్రస్థానం దాదాపు 2005 వరకు సాగింది. అంటే మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించి అలరించారు. కానీ తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకుంది జయప్రద. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయప్రద.. 1986 జూన్ 22న సినీ నిర్మాత నహతాను వివాహం చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరిన ఆమె.. ఆ తర్వాత బిజేపీలోకి మారారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న జయప్రద.. రాజకీయాల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..