AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది రెండు సినిమాలు.. రెండూ డిజాస్టర్స్.. కానీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..

ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు.. చాలా మంది ఎన్నో సినిమాలు చేసిన తర్వాత స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఒకేఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు.

చేసింది రెండు సినిమాలు.. రెండూ డిజాస్టర్స్.. కానీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2025 | 11:05 AM

Share

ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ తమను తాము నిరూపించుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. తక్కువ సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకటి , రెండు సినిమాలతోనే పాపులర్ అయిన బ్యూటీలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా డిజాస్టర్ అయ్యింది. కానీ యూత్ లో విపరీతమైన క్రేజ్. కుర్రాలంతా ఆమె జపమే చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలో నటించలేదు.. ఎక్కువ సినిమాలు చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్ ను మించి పాపులర్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

దివ్య భారతి.. చేసింది రెండు సినిమాలే.. ఒక సినిమాలో చిన్న రోల్ చేసింది. కట్ చేస్తే.. కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. ‘బ్యాచిలర్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ హీరోతోనే ‘కింగ్‌స్టన్’ చిత్రంలో నటించింది.

1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మాడి ఖాతాలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఇప్పటికీ చాట్‌బస్టర్‌గా మారింది.  ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ బ్యూటీ దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!