AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2025 | 1:09 PM

Share

రీసెంట్ డేస్‌లో థియేటర్ల కంటే.. ఓటీటీలలోనే సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కొత్త సినిమాలు థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు నెలరోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఓటీటీలోకి ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. ఆ మూవీని చూడకుండా వదిలిపెట్టట్లేదు ఆడియన్స్. ఇక ఓటీటీలకు సెన్సార్ కట్‌లు లేకపోవడంతో బోల్డ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌కు ఎలాంటి కటింగ్స్ లేవు. హీరోయిన్లు కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పడం లేదు. ఇక ఇప్పుడు ఒక బోల్డ్ సినిమా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తుంది. మరీ ఇంత బోల్డ్ గా ఉందేంటి అంటూ అందరూ అవాక్ అవుతున్నారు. అంతే కాదు ఈ సినిమా ఇండియాలో బ్యాన్ కూడా చేశారు. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..

ఓటీటీలో హీరోయిన్ రుహనీ శర్మ నటించిన బోల్డ్ సినిమా షేక్ చేస్తుంది. సింగిల్స్ మాత్రమే చూడాల్సిన ఈ మూవీలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఈ మూవీ ఇండియాలో బ్యాన్ అయింది. మరి అయితే ఓటీటీలోకి ఎలా వచ్చిందని అనుకుంటున్నారా.? మొన్నామధ్య ఈ అమ్మడి బోల్డ్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలు ‘ఆగ్రా’ మూవీలోనివి.

ఇప్పటిదాకా పద్దతిగా నటించిన రుహనీ శర్మ.. ఈ మూవీలో బోల్డ్‌గా కనిపించింది. అసలు ఆమె ఇలాంటి సన్నివేశాల్లో నటించిందంటే ఊహించడం కష్టమే. ఇక ఈ సినిమాలో శృంగారభరిత సన్నివేశాలు, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఇండియాలో బ్యాన్ అయింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో వచ్చింది. బ్యాన్ అయిందంటే.. ఎలా స్ట్రీమ్ అవుతోందని అనుకుంటున్నారా.? అదేనండీ.! ఈ మూవీఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి ఉంది. ‘ఆగ్రా’ సినిమాను డైరెక్టర్ తిత్లి కనుబెల్ తెరకెక్కించగా.. రుహాని శర్మ, మోహిత్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..