బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్
రష్మిక మందన్న పాపులారిటీ, డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 'పుష్ప', 'పుష్ప 2' సినిమా విజయాలు రష్మిక క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇప్పుడీ అందాల తారకు బాలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా థామా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మిక.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న భామ ఎవరు అంటే ఎలాంటి సందేహం లేకుండా చెప్పే పేరు రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సత్తా చాటుతుంది. ప్రస్తుతం హిందీలో థామా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే ఈ మూవీలో రష్మిక బోల్డ్ గా కనిపించింది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా చేస్తుంది. తాజాగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. బ్రేకప్ గురించి మాట్లాడింది.
ఒక రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు బ్రేకప్ అయితే ఆ బాధ అమ్మాయిలకే ఎక్కువగా ఉంటుంది అని రష్మిక చెప్పుకొచ్చింది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని నేను అంగీకరించను, ఒప్పుకోను. మా బాధను వ్యక్తపరిచేందుకు మేము మీలాగా గడ్డం పెంచుకోలేము.. మందు తాగలేము.. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ బయటకు చూపించలేము అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది ఆతర్వాత ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఇటీవలే ఈ చిన్నది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరి ఎంగేజ్మెంట్ చాలా సీక్రెట్ గా ఉంచారు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




