AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క మగాడైనా ఉన్నాడా.? ఉంటే నా ముందుకు రండి.. దువ్వాడ శ్రీనివాస్ సవాల్

బిగ్ బాస్ హౌస్‌లో దువ్వాడ మాధురి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆమె పై ఓ రేంజ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి.

ఒక్క మగాడైనా ఉన్నాడా.? ఉంటే నా ముందుకు రండి.. దువ్వాడ శ్రీనివాస్ సవాల్
Duvvada Srinivas
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2025 | 8:29 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9పై ఎంత పాజిటివ్ ఉందో అంటే నెగిటివ్ కూడా ఉంది. కొంతమంది బిగ్ బాస్ షో పై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ షో ఇప్పటికే టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ పై విమర్శలు కురిపించే వారిలో సీపీఐ నారాయణ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి  సీపీఐ నారాయణ బిగ్ బాస్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన బిగ్ బాస్ షో పైనే కాదు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున ఫ్యామిలీ పై కూడా సీపీఐ నారాయణ  పర్సనల్ అటాక్ చేశారు.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, రీతూ వర్మ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా దివ్వెల మాధురి. ఆమె ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మాధురి పై వస్తున్న ట్రోల్స్ పై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

బిగ్ బాస్ అంటే బిజినెస్.. సందేశం ఇవ్వడానికి, సమాజాన్ని ఉద్దరించడానికి బిగ్ బాస్ లేదంటూ ట్రోలర్స్‌కి ఛాలెంజ్ విసిరారు దువ్వాడ శ్రీనివాస్. సీపీఐ నారాయణ తాజాగా బిగ్ బాస్ పైన చేసిన కామెంట్స్ తప్పు.. బిగ్ బాస్ ను విమర్శించడమే కాదు నాగార్జున పై కూడా తప్పుగా మాట్లాడారు అని శ్రీనివాస్ అన్నారు. నాగార్జున వెరీ నైస్ పర్సన్.. ఆయన ఎవరి జోలికి వెళ్లరు. సినిమా హాల్స్‌కి ఆడ, మగ కలిసే వెళ్తున్నారు. మార్నింగ్ షో చూస్తే.. స్టూడెంట్స్ చాలామంది ఆడ మగ కలిసే వెళ్తున్నారు. వాళ్లు ఎందుకు వెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి సినిమాలను బ్యాన్ చేద్దామా? దానికి ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు శ్రీనివాస్. బిగ్ బాస్ సందేశం ఇవ్వడానికి పెట్టలేదయ్యా.. బిజినెస్ కోసం పెట్టారు. సందేశం అని అంటారేంటి? మనం సందేశం ఇవ్వడానికి పుట్టడానికి పుట్టలేదు. తెల్లారిలేస్తే చాలు.. మాధురి ఏం సందేశం ఇస్తుంది? దువ్వాడ శ్రీనివాస్ ఏం సందేశం ఇస్తున్నారు? బిగ్ బాస్ ఏం సందేశం ఇస్తుందని అంటారు. ఇప్పటి వరకూ ఈ భూమ్మీద ఒక్కడంటే ఒక్కడైనా శ్రీరామచంద్రుడు పుట్టారా? పరాయి స్త్రీ మొహం కూడా చూడని ఒక మగాడు పుట్టాడా? పుడితే నన్ను విమర్శించే ట్రోలర్స్ నా ముందుకు రండి.. నేను ఆన్సర్ చెప్తా.. అంటూ సవాల్ విసిరారు శ్రీనివాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..