Tollywood : ఒకే హీరోతో 5 సార్లు ప్రేమలో పడిన హీరోయిన్.. కట్ చేస్తే.. అదే హీరోకు తల్లిగా.. ఎవరంటే..
ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడు సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ పాన్ ఇండియా బ్యూటీ. అయితే ఆమె వెండితెరపై ఒకే హీరోతో ఐదు సార్లు ప్రేమలో పడింది. కట్ చేస్తే అదే హీరోకు తల్లిగా కనిపించింది.

సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయిన్స్ పోషించే పాత్రలు నిత్యం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒకప్పుడు హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు.. ఇప్పుడు స్టార్ హీరోలకు తల్లిగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తల్లి పాత్రలో కనిపించింది. అంతేకాదు.. ఆదే హీరోతో సిల్వర్ స్క్రిన్ పై దాదాపు 5 సార్లు ప్రేమలో పడింది. ఆమె ఎవరో తెలుసా.. ? దీపికా పదుకొనే. అవును.. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఆమె షారుఖ్ ఖాన్ తల్లిగా కనిపించింది. దీపికా, షారుఖ్ ఖాన్ ఇద్దరు కలిసి ఫరాఖాన్ తెరకెక్కించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే దీపిక బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టా్ర్ గా మారింది. ఓం శాంతి ఓం తర్వాత, ఈ జంట రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)లో తిరిగి కలిశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫరా ఖాన్ రూపొందించిన హ్యాపీ న్యూ ఇయర్ (2014) మూవీలో కలిసి నటించారు. ఇందులో షారుఖ్, దీపిక జంటగా నటించారు. ఇక సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన స్పై యాక్షన్ మూవీ పఠాన్ చిత్రంలోనూ మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇదిలా ఉంటే.. అట్లీ తెరకెక్కించిన జవాన్ చిత్రంలో దీపికా అతిథి పాత్రలో నటించింది. ఇందులో షారుఖ్ తల్లిగా కనిపించింది దీపికా. జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ కు తన 30 ఏళ్ల కెరీర్ లో తొలి జాతీయ అవార్డును సంపాదించిపెట్టింది.ఈ సినిమాలో దీపిక నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమా సమయానికి దీపికా, షారుఖ్ మధ్య వయసు వ్యత్సాసం 20 ఏళ్లు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి కొత్త సినిమాలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..








