AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ప్రతి క్షణం ఉత్కంఠ.. ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్..

ప్రస్తుతం ఓటీటీలు ఎక్కువగా థ్రిల్లర్, యాక్షన్ ప్యాక్డ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. రేటింగ్.. ప్రతి క్షణం ఉత్కంఠ, ఊహించని ట్విస్టులు ఉన్న సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్నాయి.. ముఖ్యంగా జియో హాట్ స్టార్ లో కొన్ని జానర్ చిత్రాలు, వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇంతకీ ఈ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

Cinema : ప్రతి క్షణం ఉత్కంఠ.. ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్..
Cinema
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2025 | 9:12 PM

Share

కొన్ని వెబ్ సిరీస్ లు తీవ్ర ఉత్కంఠ, భావోద్వేగాల మధ్య సాగుతుంటాయి. ది నైట్ మేనేజర్ నుండి స్పెషల్ ఆప్స్ వరకు, ప్రతి సిరీస్ నటన, నిర్మాణం, విజువల్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. తమన్నా భాటియా, ఆదిత్య రాయ్ కపూర్, కె.కె. మీనన్ వంటి తారలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీలో అతి తక్కువ రేటింగ్ అందుకున్నప్పటికీ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న కొన్ని వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

ది నైట్ మేనేజర్ ఆదిత్య రాయ్ కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్. బ్రిటిష్ స్పై థ్రిల్లర్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ షాన్ సేన్‌గుప్తా అనే మాజీ సైనికుడిగా నటించాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

‘అంతిమ సత్యం’ తమన్నా భాటియా నటించిన ఈ సిరీస్.. ఆఖ్రీ సచ్ OTT ప్లాట్‌ఫామ్‌లో దూసుకుపోతుంది. ఈ సిరీస్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, ఎమోషన్ ఇలా అన్ని అంశాలను చూపిస్తుంది. ఈ కథ మొత్తం దేశాన్ని కదిలించే ఒక రహస్య కుటుంబ మరణ కేసు చుట్టూ తిరుగుతుంది. తమన్నాతో పాటు, ఈ సిరీస్‌లో అభినవ్ ఖురానా, రాణా సహోతా, రాజేష్ శర్మ కూడా నటించారు.

‘ది ఫ్రీలాన్సర్’ నీరజ్ పాండే నిర్మించి, భువన్ అరోరా, మోహన్‌లాల్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ సిరీస్ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ కథ అవినాష్ కామత్ (మోహిత్ రైనా) అనే మాజీ పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను తన స్నేహితుడి కుమార్తెను ఉగ్రవాద సంస్థ నుండి రక్షించడానికి ఒక ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తాడు. ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..