Mana Shankara VaraPrasad Garu: మెగాస్టార్ అంటే ఇంత క్రేజ్.. ఒక్క టికెట్ ఎంతకు కొన్నారో తెలుసా
మెగాస్టార్ చిరంజీవి నామస్మరణతో టాలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్‌గా మారింది. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కేవలం యూట్యూబ్ రికార్డులనే కాదు, సినీ అభిమానుల గుండెల్ని కూడా షేక్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయస్సు దాటుతున్నా ఆయన నటించిన సినిమాలకు క్రేజ్ తగ్గడం లేదు. చిరుకు రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోను అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ సినిమా విడుదల అవుతుందంటే ఆయన అభిమానులకు పండుగే.. ఆయనకు దేశ వ్యాప్తంగా పడి చచ్చిపోయే ఫాన్స్ ఉన్నారు. చిరుకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటే ఉభయగోదావరి జిల్లాలో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. అందులో ఆయన పుట్టిన మొగల్తూరు విద్యాభ్యాసం చేసిన నరసాపురంలో ఆయన సినిమా విడుదలవుతుందంటే ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృషవంశీ
సంక్రాంతికి విడుదలవుతునన్న శంకర్ వరప్రసాద్ గారు బెనిఫిట్ షో మొదటి టికెట్ ను వేలం పాటలో మొదటి టికెట్ కొనుక్కునేందుకు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మెగా అభిమానులు పోటీపడ్డారు. పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్లో మెగాస్టార్ అభిమాన సంఘం నిర్వహించిన వేలంపాటలో నర్సాపురం పట్టణానికి చెందిన చాగంటి గణేష్ రూ 1.02 లక్షలకు టికెట్ ను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో బెనిఫిట్ షో టికెట్ కొనుగోలు చేసిన ముగ్గురు అభిమానుల్ని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ కలిసే అవకాశం ఉండటంతో పలువురు అభిమానులు ఈ వేలంపాటలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. మెగాస్టార్ చిరంజీవి శంకర్ వరప్రసాద్ సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాట పాడిన చిరు అభిమానికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపెళ్లి సుబ్బారాయుడు టిక్కెట్టును అందజేశారు.
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి




