Raasi: రాశి భర్త ఇండస్ట్రీలో బాగా ఫేమస్.. తెలుగులో సినిమాలు కూడా చేశాడు.. వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా
అలనాటి అందాల తార, సీనియర్ హీరోయిన్ రాశి పేరు ఈ మధ్యన బాగా వినిపిస్తోంది. ఓ టీవీ షోలో ఆమె పేరు వచ్చేలా యాంకర్ అనసూయ ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం, అందుకు రాశి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అయితే అనసూయ రాశికి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

చాలా మంది హీరోయిన్లలాగే నటి రాశి కూడా ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . మమతల కోవెల, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం, బాలగోపాలుడు, ఆదిత్య 369 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో బాల నటిగా యాక్ట్ చేసి మెప్పించింది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసింది రాశి. ఆ తర్వాత 1997లో పెళ్లి పందిరి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, సముద్రం, కృష్ణబాబు, మూడు ముక్కలాట, ఆమ్మో ఒకటో తారీఖు, దేవుళ్లు, సందడే సందడి, గిల్లి కజ్జాలు తదితర సినిమాల్లో హీరోయిన్ గా చేసి మెప్పించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తోనూ అలరించిందీ అందాల తార. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో నెగెటివ్ రోల్ లోనూ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తోంది రాశి. గిరిజా కళ్యాణం, జానకి కనగనలేదు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిందీ అందాల తార.
ఇదిలా ఉంటే సినిమాల సంగతి తప్పితే రాశి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. రాశిది ప్రేమ వివాహం. తెలుగుతో పాటు తమిళ భాషల్లో సినిమాలు చేసిన ప్రముఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమునిని రాశి వివాహం చేసుకుంది. రాశి నటించిన పలు సినిమాలకు ఆయన సహాయక దర్శకుడిగా పని చేశారు. ఆ సమయంలో మొదలైన పరిచయంతో వారు మంచి స్నేహితులుగా మారారు. అయితే.. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలోనే రాశి తండ్రి కన్నుమూశారు. అదే సమయంలో రాశికి అన్ని విధాలా అండగా నిలబడ్డారు శ్రీముని. ఈ సమయంలోనే తనను పెళ్లి చేసుకుంటారా? అని తానే ముందుగా అడిగిందట రాశి. దీనికి శ్రీముని కూడా ఓకే చెప్పడంతో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారట.
భర్త, కూతురితో నటి రాశి..
View this post on Instagram
కాగా రాశీ ప్రధాన పాత్రలో లంక అనే ఓ సినిమాను కూడా తీశాడు శ్రీముని. అంతకు ముందు కూడా ఓ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం రాశి, శ్రీముని దంపతులకు ఒక కుమార్తె ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
