ఆమె కోసం ప్రాణమైన ఇస్తాను.. హీరోయిన్ ఖుష్బూ ఎమోషనల్ కామెంట్స్
సీనియర్ నటి కుష్బూ సుందర్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్ బాషాల్లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది కుష్బూ. కేవలం నటిగానే కాదు.. రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్‌కు మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లోనూ సత్తా చాటారు కుష్బూ.

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకానొక సమయంలో తమ అందంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ఖుష్బూ. తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ అందాల తార ఇప్పుడు సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో కుష్బూమాట్లాడుతూ సంచలన విషయాలను పంచుకున్నారు. ఖుష్బూ మాట్లాడుతూ, సొంత తండ్రుల నుంచి కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఆడపిల్లలు అని అన్నారు. ముఖ్యంగా 13-15 సంవత్సరాల మైనర్లు, తమ సమస్యలను ధైర్యంగా బయటపెట్టాలని ఆమె అన్నారు.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
మీరు మీ కోసం మాట్లాడకపోతే, మరెవరూ మాట్లాడరు అని ఖుష్బూ చెప్పుకొచ్చారు. ఇటువంటి సున్నితమైన విషయాలలో కుటుంబ సభ్యులు కూడా నమ్మడానికి ఆడపిల్లలు సందేహిస్తారని, అయితే బాధితులు భయం వీడి విశ్వాసంతో వాస్తవాలను బయటపెట్టాలని.. తన తండ్రితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, తన తల్లిని మాత్రమే తన కుటుంబంగా భావిస్తానని ఆమె స్పష్టం చేశారు. అమ్మకు ప్రాణమిస్తానని, తన తల్లితోనే సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఖుష్బూ సమాజంలో లింగ సమానత్వం గురించి మాట్లాడుతూ.. సమాజాన్ని మనమే నిర్మిస్తాం, లింగ భేదం గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాం? అని ప్రశ్నించారు. సమాజంలో మార్పు వస్తుందని, రావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృషవంశీ
సంపాదించిన దానిని తిరిగి సమాజానికి ఇవ్వడం ముఖ్యమని, ఎందుకంటే మనం ఏదీ వెంట తీసుకెళ్లలేమని ఆమె అన్నారు. రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగానో, మంత్రిగానో కావాలనే కోరిక లేదని, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడమే తన నిజమైన కల అని ఖుష్బూ వెల్లడించారు. తమిళనాడు బీజేపీకి అన్నాములై గారు ఒక పెద్ద బలం అని ఆమె పేర్కొన్నారు.
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




