ఎన్టీఆర్‌ను ఎదిరించే ఒకే ఒక్క మగడు అతనే.. ఓపెన్‌గా చెప్పిన బాలకృష్ణ
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. వరుసగా 5 బ్లాక్ బస్టర్ అందుకొని దూసుకుపోతున్నారు బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ.

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రీసెంట్ డేస్ లో బాలయ్య బాబు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. వరుసగా 5 విజయాలను అందుకున్నారు బాలయ్య. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతుంది. కాగా గతంలో బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ గురించి, అలాగే తన అన్న హరికృష్ణగారి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
తన మొదటి సినిమా, తాతమ్మ కల గురించి బాలకృష్ణ తన అనుభవాలను పంచుకున్నారు. అప్పట్లో తాను స్కూల్‌కు వెళ్లేవాడినని, సెలవు పెట్టి షూటింగ్‌కు వెళ్లడం కొత్త అనుభవం అని గుర్తుచేసుకున్నారు. తాతమ్మ కల సినిమాలో భానుమతి గారు నాయనమ్మ పాత్ర లో నటించగా.. ఓ సన్నివేశంలో తాను నడుచుకుంటూ రావాల్సి ఉందని, ఆ సమయంలో తండ్రి రామారావు గారి సినిమాల్లోని నడకను ఇమిటేట్ చేశానని తెలిపారు బాలయ్య. రామారావు గారు ప్రతి పాత్రకు అనుగుణంగా నడకను మార్చేవారని, ఉదాహరణకు నిండు మనుషులు, నిప్పులాంటి మనిషి చిత్రాల్లో ఆయన భుజాలు డ్రూప్ చేస్తూ నడిచేవారని బాలకృష్ణ వివరించారు. తాను ఆ నడకను అనుకరించగానే, ఏంటి ఆ నడక? అని తన తండ్రి అడిగారని బాలయ్య తెలిపారు. ఆ సమయంలో తనకు 14 ఏళ్లు మాత్రమేనని, ఆ ప్రభావం తనపై చాలా ఉందని చెప్పారు.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృషవంశీ
అలాగే తన అన్న హరికృష్ణ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆయన చిన్నప్పటి నుంచి ఎదురుతిరిగే స్వభావం కలవారని, తన తాత గారి దగ్గర ఊర్లో పెరిగారని అందుకే మొండిగా ఉండేవారని బాలకృష్ణ వెల్లడించారు. ఒక దశ వరకు రామారావు గారికి రైట్ హ్యాండ్‌గా ఉన్న హరికృష్ణ, ఆ తర్వాత తనదైన పంథాలో వచ్చేశారని పేర్కొన్నారు. తండ్రి ఏం చేసినా సరే, ధైర్యంగా ప్రశ్నించే స్వభావం హరికృష్ణది అని బాలకృష్ణ చెప్పారు. అందరికంటే ఎక్కువ ఆయనే ధైర్యంగా మాట్లాడతారు అని బాలయ్య అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




