AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనికి నేను నా సొంత డబ్బులు రూ. 20లక్షలు ఇచ్చాను.. అసలు విషయం చెప్పిన రాజా

హీరో రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆనంద్, ఆ నలుగురు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాజా.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అతనికి నేను నా సొంత డబ్బులు రూ. 20లక్షలు ఇచ్చాను.. అసలు విషయం చెప్పిన రాజా
Raja
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2026 | 8:28 PM

Share

నటుడు రాజా గుర్తున్నాడా.? ఒకప్పుడు హీరోగా మెప్పించి ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. ఆనంద్ సినిమాతో చాలా మంది ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాజా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. రాజా మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా విజయం వెనుక ఉన్న కృషిని, వ్యక్తిగత నష్టాలను వివరించారు. 2010లో వచ్చిన ఇంకోసారి సినిమా విడుదల తనకు తీరని నష్టాన్ని మిగిల్చిందని రాజా తెలిపారు. ఆ సినిమాను విడుదల చేయడానికి ఎంతో కష్టపడ్డానని, నిర్మాతకు తన సొంత డబ్బు నుంచి రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చానని చెప్పారు రాజా. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదని పేర్కొన్నారు. అయితే, విచిత్రంగా అదే సినిమాకు దర్శకుడికి, అలాగే వెన్నెల కిషోర్‌కు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డులు వచ్చాయని గుర్తుచేసుకున్నారు.

17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ

ఆనంద్ సినిమాతో నటుడిగా రాజాకు విశేష గుర్తింపు లభించింది. 2004లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, ప్రజలు తన అసలు పేరును మర్చిపోయి ఆనంద్ అనే పిలిచేవారని, 12 ఏళ్ల తర్వాత కూడా ఈ పేరుతోనే గుర్తిస్తున్నారని రాజా చెప్పారు. ఆనంద్ సినిమా షూటింగ్‌కు ముందే తాను ఆ నలుగురు చిత్రంలో నటించానని తెలిపారు. ఆనంద్ విడుదల సమయంలో శేఖర్ కమ్ముల పడిన కష్టాన్ని రాజా వివరించారు. ఆ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు, శాటిలైట్ హక్కులు లభించక కమ్ముల తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, తన సంపాదన మొత్తాన్ని చిత్ర నిర్మాణం, విడుదల కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు రాజా. శేఖర్ కమ్ముల అంకితభావం, కృషి చివరికి మంచి ఫలితాన్ని ఇచ్చాయని రాజా ఆనందం వ్యక్తం చేశారు.

EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్

తన కెరీర్‌లో 30-35 సినిమాలు చేసినప్పటికీ, పెద్ద దర్శకులు లేదా పెద్ద బ్యానర్లలో సినిమాలు ఎందుకు చేయలేదని అడిగినప్పుడు, తనకు ఆఫర్లు రాలేదని, తాను ఎవరినీ అడగలేదని రాజా స్పష్టం చేశారు. తన చాక్లెట్ బాయ్ ఇమేజ్  కారణంగానే దర్శకులు తనను వేరే యాంగిల్ లో దర్శకులు చూడలేదేమో అని అన్నారు రాజా. బాంబేలో శ్రీదేవి గారి సినిమా అపురూపం ఆడిషన్స్ కోసం వెళ్ళానని, అక్కడ ఈవీవీ సత్యనారాయణ గారికి తన తెలుగు మాట తీరు నచ్చిందని తెలిపారు. ఈవీవీ సత్యనారాయణ గారి కుమారులు నరేష్, రాజేష్ లతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. వారి ద్వారానే సత్తిబాబు గారి ఓ చిన్నదాన చిత్రంలో సహాయ పాత్ర చేసే అవకాశం వచ్చిందని, ఆ తర్వాత శ్రీకాంత్ గారు కూడా ఒకే చెప్పడంతో ఆ సినిమాకు ఎంపికయ్యానని వివరించారు రాజా. విధిని ఎవరూ మార్చలేరు అన్నట్లుగా తన తొలి సినిమా విజయవంతమైందని రాజా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృష్ణవంశీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.