సినీ నటుడు, పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ ఆదివారం పల్నాడు జిల్లాలో ఆధ్యాత్మిక యాత్ర చేశారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని, నకరికల్లు అడ్డరోడ్డులోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.