Telangana: ప్రాణాలు కాపాడండి.. రూ.25వేల బహుమతి పొందండి!
రాష్ట్రంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రోజూ కొన్ని వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది సకాలంలో వైద్యం అందకే మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మరణాల రేట్లను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధితులను రక్షించే వారికి నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
