AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్‌

సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్‌

Phani CH
|

Updated on: Feb 09, 2026 | 1:33 PM

Share

ముంబై తీరంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీ ఆయిల్ స్మగ్లింగ్ ముఠాను పట్టుకుంది. అరేబియా సముద్రంలో సముద్ర-వాయు ఆపరేషన్ ద్వారా 100 నాటికల్ మైళ్ల దూరంలో మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ఆంక్షలున్న దేశాల నుంచి అక్రమంగా చమురును రవాణా చేస్తూ పన్నులు ఎగ్గొడుతున్న ఈ నెట్‌వర్క్‌ను గుర్తించి, నిందితులపై కేసులు నమోదు చేశారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అక్రమ చమురు రవాణా.

ముంబై తీరం, అరేబియా సముద్రానికి మధ్యలో ఆయిల్ స్మగ్లింగ్ ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్‌ పట్టుకున్నారు. ముంబైకి 100 నాటికన్ మైళ్ల దూరంలో ఆయిల్ రవాణా జరుగుతుండగా, సీ-ఎయిర్ ఆపరేషన్ నిర్వహించి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ముఠాను పట్టుకుంది. సముద్రం మధ్యలో కొన్ని నౌకల ద్వారా అక్రమంగా ఆయిల్ స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయంగా ఆయిల్ అమ్మకాలపై ఆంక్షలు ఉన్న దేశాల నుంచి వచ్చే నాసిరకం చమురును స్మగ్లింగ్ ముఠా సేకరిస్తోంది. సముద్రం మధ్యలోనే.. ఒక నౌక నుంచి మరో నౌకలోకి ఆయిల్‌ను మార్చి తీరానికి దగ్గరలో ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి లేటెస్ట్ టెక్నాలజీ, నిఘా పరికరాలు, ఇతర డాటా ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు. మూడు అనుమానిత నౌకలను చుట్టుముట్టి తనిఖీ చేసారు. నౌక డాక్యుమెంట్లు తనిఖీ చేయగా.. ఆయిల్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు కోస్ట్‌గార్డ్‌ గుర్తించారు. ఇదో అంతర్జాతీయ నెట్‌వర్క్ అని అనుమానించారు. ఈ ఆయిల్ అక్రమ రవాణాలో అనేక దేశాల పాత్ర ఉన్నట్లు తెలుసుకున్నారు. నౌకలతో పాటు వాటిలోని సిబ్బందిని ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌ తీరానికి తరలించింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే

అంతరిక్షంలో గూఢచర్యం.. భారత్ కు ఇప్పుడు ఈ సత్తా కూడా ఉంది

రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం

Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

Follow Us