శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో అర్ధరాత్రి ఐదు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. దొంగలు కిల్లి వెంకట్రావు, దుర్యోధనరావు సహా ఐదుగురి ఇళ్ల తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారం, 3 కేజీల వెండి, లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.