07 January 2026
మేకప్ లేకపోయినా డిమాండ్ ఎక్కువే.. సాయి పల్లవి అందం రహస్యం ఇదేనట..
Rajitha Chanti
Pic credit - Instagram
భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. న్యాచురల్ బ్యూటీ అనే పేరును సంపాదించుకుంది ఈ అమ్మడు.
ఫిదా సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుస సినిమాలతో లేడీ పవర్ స్టార్ గా నిలిచింది సాయి పల్లవి.
ప్రస్తుతం హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఇందులో సీత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
సాయి పల్లవి మేకప్ వేసుకోదు. కేవలం సన్ స్క్రీన్ మాత్రమే ఉపయోగిస్తానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది.
తన చర్మానికి నిగారింపు ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటానని తెలిపింది. సరిగ్గా తినడం వల్లే తాను అందంగా ఉంటానని చెప్పుకోచ్చింది.
ఆరోగ్యకరమైన చర్మం కోసం పండ్లు, కూరగాయలు, మొలకలు తీసుకుంటానని తెలిపింది. అలాగే రోజు వ్యాయామంతోపాటు యోగా కూడా చేస్తుందట.
వ్యాయామం చేసినప్పుడు రక్త నాళాలు వ్యాకోచించడం వల్ల తన శరీరం హైడ్రేట్ గా ఉంటుందని.. అలాగే ప్రోటీన్, కొల్లాజెన్ మరింత మెరుగు పరుస్తుందట.
సాయి పల్లవి ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతుందట. ఎక్కువ నీరు త్రాగేవారికి మచ్చలు, ముడతలు రావని.. జుట్టు సంరక్షణకు ఆయుర్వేద పద్దతి ఉపయోగిస్తుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్