Rahul Gandhi: నేడు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ.. నేతలతో మీటింగ్.. ఆ తర్వాత..
మూడు రోజుల విరామం తర్వాత పాదయాత్రలో పాల్గొనేందుకు నేడు (బుధవారం) హైదరాబాద్ వస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే రాహుల్.. కొంత మంది..

మూడు రోజుల విరామం తర్వాత పాదయాత్రలో పాల్గొనేందుకు నేడు (బుధవారం) హైదరాబాద్ వస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే రాహుల్.. కొంత మంది నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత నారాయణపేట్ జిల్లా మక్తల్‌కు వెళ్తారు. అక్కడి నుంచి గురువారం ఉదయం 6 గంటలకు పాదయాత్రను మొదలు పెడుతారు. వచ్చె నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది. భారత్ జూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు మక్తల్ మక్తల్ చేరుకోనున్న రాహుల్.. ఎల్లుండి ఉ. 6:30కి మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు పాదయాత్ర సాగనుంది. ఇక అక్కడే రాహుల్ లంచ్ చేసి, రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ ఏర్పాటు చేశారు. మొదటిరోజు 26 కిలో మీటర్లు రాహుల్ గాంధీ నడవనున్నారు.
కాగా.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో.. ఐదో రాష్ట్రం తెలంగాణ. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ యాత్ర ప్రారంభమైంది. కృష్ణా వంతెన మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ ప్రవేశించారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ ఘన స్వాగతం చెప్పింది. దీపావళి పర్వదినం సందర్భంగా సెలవు, విశ్రాంతి కోసం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర 16 రోజులపాటు తెలంగాణలో సాగనుంది. నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశిస్తారు.
మరోవైపు.. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఈ సుదీర్ఘ యాత్రం దేశంలోని 12 రాష్ట్రాల్లో సాగనుంది. 3,500 కిలోమీటర్ల మేర పర్యటించేలా ఈ పాదయాత్రను ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభమైంది. ఇప్పటికి నెలా పదిహేను రోజుల యాత్ర పూర్తైంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..