ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 44 రోజుల మాఘమేళాలో ఒక వింత సాధువు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 26 ఏళ్ల బీహార్‌కు చెందిన శంకర్ పురి, గత ఏడేళ్లుగా ఒంటి కాలిపైనే జీవనం సాగిస్తూ, అసలు పడుకోవడం లేదా కూర్చోవడం చేయలేదని చెబుతున్నారు. ఈ అసాధారణ దీక్షను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.