AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం

పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 7:37 PM

Share

మకర సంక్రాంతి వేళ చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. నైలాన్‌, గాజు పొడితో తయారైన ఈ దారం మనుషులు, పక్షులకు తీవ్ర హాని కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలకు, పక్షుల మరణాలకు కారణమవుతోంది. పర్యావరణానికి ముప్పుగా మారిన దీనిని నిషేధించాలని అధికారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక, సురక్షితమైన దారాలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మకర సంకాంత్రి సందడి మొదలైంది. కొత్త పంట ఇంటికి రావడంతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా పతంగుల సందడి మొదలైంది. ఇప్పటికే యువకులు, చిన్నారులు ప్రత్యేకంగా తయారు చేసిన పంతగులను ఎగురవేస్తుండగా కొంతమంది వ్యాపారులు అధికారుల కళ్లు కప్పి చైనా మాంజా విక్రయిస్తున్నారు. చైనా మాంజా తయారీలో నైలాన్‌, సింథటిక్‌ దారాలు వాడతారు వాటికి గాజుపొడి హానికరమైన రసాయనాలు పూస్తారు. ఈ మాంజాతో జంతువులు, పక్షులు, మనుషులు గాయపడిన సందర్బాలెన్నో. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి గొంతులకు మాంజా చుట్టుకోవడం, వారు ప్రాణాలు కోల్పోవడం ఏటా జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లైఓవర్లపై వెళ్లే వాహనదారులు దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల రెక్కలు ఈ గట్టి దారం వల్ల తెగిపోతున్నాయి. ఏటా వేల సంఖ్యలో పావురాలు, గద్దలు, ఇతర అరుదైన పక్షులు ఈ మంజా ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి. ఈ దారం పర్యావరణంలో అంత సులభంగా కలిసిపోదు. చెట్లపై, విద్యుత్ తీగలపై చిక్కుకుని ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయి మూగజీవాల ప్రాణాలను హరిస్తోంది. తాజాగా ఉజ్జయినిలో ద్విచక్రవాహనం పై వెళుతోన్న ఓ పురోహితుడి మెడకు మాంజా చుట్టుకుంది. ప్రాణాపాయ పరిస్థితిలో ఊపిరాడక విలవిల్లాడారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు రెండు గంటల పాటు సర్జరీ చేసి మాంజాను తొలగించారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చైనా మాంజాకు బదులుగా స్థానికంగా ముడి వస్తువులతో తయారు చేసే లోకల్‌ మాంజాను వినియోగించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఉజ్జయిని నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పతంగుల పండుగ వేళ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే ‘చైనా మంజా’ను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చైనా మంజా విక్రయాలు, వాడకంపై పోలీస్ యంత్రాంగం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తుందని, సాధారణ నూలు దారానికి బదులుగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారు చేసి, గ్లాస్ కోటింగ్ ఇచ్చే ఈ చైనా మంజా ఒక నిశ్శబ్ద హంతకిగా మారిందని.. ఇది కేవలం పక్షులకే కాదు, మనుషులకు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తోందన్నారు. చైనా మాంజా వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని అధికారులు, పర్యావరణ పరిరక్షకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు

Rajinikanth: ‘ఎన్ని ఉన్నా.. అనాథలానే అనిపిస్తుంది’

Rajeev Kanakala: అవకాశాలు రావడం లేదుకానీ.. వస్తే తరుణ్‌కు తిరుగే ఉండదు

Chandrabose: నలభై రూపాయల పుస్తకానికి.. 40 లక్షలు.. చంద్రబోస్ తుంటరి పనితో.. ఊరికి మేలు

RGV: ‘ఆర్జీవీని సైకో అన్నారు..అందుకే భయపడ్డా’ కానీ.. ఆ తర్వాత