Chandrabose: నలభై రూపాయల పుస్తకానికి.. 40 లక్షలు.. చంద్రబోస్ తుంటరి పనితో.. ఊరికి మేలు
చంద్రబోస్ విద్యార్థి దశలో రూ.40 విలువైన డిక్షనరీని తీసుకున్న గిల్ట్ ఫీలింగ్, ఆయన్ను ఆస్కార్ విజేతను చేసింది. ఆ రుణాన్ని తీర్చుకునేందుకు, తన స్వగ్రామమైన చల్లగరిగలో రూ.40 లక్షలతో ఓ అధునాతన గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ గ్రంథాలయం యువతకు అక్షర జ్ఞానాన్ని అందిస్తోంది. ఆయన గిల్ట్ మంచి పనికి నాందిగా మారి, ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రతీ మనిషికీ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అయితే కొందరిలోని ఈ గిల్టీ ఫీలింగ్ .. పలు సందర్బాల్లో.. పలు మంచి పనులకు నాందిగా మారింది. ఎంతో మందికి మేలు చేసింది. సరిగ్గా చంద్రబోస్ విషయంలోనూ కూడా ఇదే జరిగింది. ఆయన గిల్టీ ఫీలింగ్ కాస్తా.. తన సొంతూరుకు మేలు చేసేలా చేసింది. యువతకు అక్షర జ్జానాన్ని ప్రసాదించే గ్రంథాలయ నిర్మాణానికి ఆయన పూనుకునేలా.. పూర్తి చేసేలా.. చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే.. ! చంద్రబోస్ తన విద్యార్థి దశలో… సినీ ప్రయాణ ప్రారంభంలో.. ఒక నిఘంటువును ఎవరికీ చెప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది. ఆ పుస్తకం విలువ అప్పట్లో కేవలం 40 రూపాయలు మాత్రమే. అయితే, ఆ పుస్తకం తనలో నింపిన భాషా పరిజ్ఞానం ఆయనను ఆస్కార్ విజేతను చేసింది. దాంతో పాటే ఆ పుస్తకాన్ని కొట్టేశాననే గిల్ట్ ఫీలింగ్‌ను ఆయనలో నింపింది. ఈ క్రమంలోనే తన మనసులో ఉండిపోయిన గిల్ట్ ఫీలింగ్‌ను పోగొట్టుకోవడానికి, ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన సొంత ఊరైన చల్లగరిగలో 40 లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఒక అధునాతన గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆ నలభై రూపాయల రుణాన్ని ఇలా 40 లక్షలతో.. అందరికీ అక్షరు జ్ఙానాన్న ప్రసాదించే గ్రంథాలయంతో తీర్చుకున్నారు.ఇదే విషయాన్ని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో అందరితో పంచుకున్నారు. ఈ విషయంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు మన ఆస్కార్ విజేత చంద్రబోస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: ‘ఆర్జీవీని సైకో అన్నారు..అందుకే భయపడ్డా’ కానీ.. ఆ తర్వాత
Poonam Kaur: పెళ్లి.. అబార్షన్.. నా లైఫ్ గురించి సోషల్ మీడియాలో
శంకరవరప్రసాద్ సెన్సార్ రివ్యూ.. అంతా ఓకే గానీ..
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

