Varanasi: జక్కన్న ఝలక్.. వారణాసి రిలీజ్ డేట్ లాక్
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB29 (వారణాసి) రిలీజ్ డేట్‌ను రాజమౌళి ఏప్రిల్ 9, 2027గా నిర్ణయించారు. షూటింగ్ పూర్తి కాకముందే ఈ ముందస్తు ప్రకటన ఆయన వ్యూహంలో భాగం. మహేష్ బాబు రాముడిగా నటించడం, పోటీ లేని సమయం, పారిస్‌లో టీజర్ వంటి ప్రత్యేక ప్రమోషన్స్‌తో జక్కన్న భారీ ప్రణాళికతో ఉన్నారు.
SSMB29 రిలీజ్ డేట్ ఎప్పుడు..? షూటింగే ఇంకా కాలేదు.. ఈ ఏడాది రాను కూడా రాదు.. అప్పుడే రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకోవడం ఓవర్‌గా లేదూ అనుకుంటున్నారు కదా..? కానీ రాజమౌళి ఆలోచనలు మరోలా ఉన్నాయి. వారణాసికి జక్కన్న ప్లానింగ్ పీక్స్‌లో ఉంది. విడుదల తేదీ విషయంలోనూ వేరేలా ఆలోచిస్తున్నారీయన. మరి అదేంటో చూద్దామా..? ఎందుకో తెలియదు కానీ మహేష్ బాబు సినిమా మొదలైన రోజు నుంచే రాజమౌళి తన వర్కింగ్ స్టైల్ మార్చుకున్నారు. అంతకుముందు చాలా నెమ్మదిగా ప్రమోషన్స్ చేసే అలవాటున్న జక్కన్న.. వారణాసి కోసం అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఏడాదిన్నర ముందే టీజర్ విడుదల చేయడం.. మేకింగ్ వీడియో ఇవ్వడం అన్నీ ఒక వింతే. రిలీజ్ డేట్ విషయంలోనూ రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. మహేష్ బాబు సినిమాను శ్రీ రామనవమి సందర్భంగా ఏప్రిల్ 9, 2027న విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులో రాముడిగా నటిస్తున్నారు మహేష్ బాబు. అందుకే ఆ రోజైతే బాగుంటుందని చూస్తున్నారు రాజమౌళి.. పైగా ఆ టైమ్‌లో పెద్దగా సినిమాలు కూడా ఏం లేవు. అన్నింటికంటే ముఖ్యంగా ఏడాది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ టైమ్‌కు ఎవరూ పోటీకి రారు అనేది జక్కన్న ప్లాన్. ఇన్ని ఆలోచించుకున్న తర్వాత 2027, ఏప్రిల్ 9 లాక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ కూడా 2026 ఫస్టాఫ్‌లోనే పూర్తి కానుంది.. ఆర్నెళ్లకు పైగా పోస్ట్ ప్రొడక్షన్.. 4 నెలలు ప్రమోషన్స్ కోసం కేటాయించనున్నారు రాజమౌళి. పారిస్లోని లే గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో వారణాసి టీజర్ రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా హాలీవుడ్ సినిమాలకే ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. ఇదే జరిగితే ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా వారణాసి నిలుస్తుంది. మొత్తానికి వారణాసి విషయంలో అన్నీ అడ్వాన్స్‌గానే ఉన్నారు జక్కన్న
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా
లేచింది మహిళా లోకం.. ఆ సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లు
మేమే హీరోయిన్స్.. మేమే స్పెషల్ గాళ్స్.. కొత్త ట్రెండ్
పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరమవుతున్న బాలీవుడ్
Meenakshi Chaudhary: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

